దర్శకదిగ్గజం ఎస్‌ఎస్ రాజమౌళి(Rajamouli) దర్శకత్వంలో యంగ్ టైగర్ ఎన్టీఆర్(NTR), మెగా పవర్‌స్టార్ రామ్ చరణ్(Ram Charan) హీరోలుగా తెరకెక్కించిన చిత్రం ‘ఆర్ఆర్ఆర్’ (RRR) మార్చి 25న ప్రపంచవ్యాప్తంగా విడుదలైంది. ఈ సినిమాను చూసేందుకు అభిమానులు థియేటర్లకు క్యూ కడుతున్నారు. అయితే తొలి వారం రోజుల్లోనే కలెక్షన్ల సునామీ సృష్టించిన ఈ సినిమా ఎనిమిదో రోజు కూడా బాక్సఫీసు వద్ద దుమ్మురేపింది.
అయితే ఆర్ఆర్ఆర్ మూవీ 8 రోజుల్లోనే దాదాపు 751 కోట్ల గ్రాస్, 414 కోట్ల షేర్ వసూలు చేసినట్లు సమాచారం. ఇక ఈ సినిమా తొమ్మిదో రోజు కూడా ఇదే జోరును కొనసాగించి సరికొత్త రికార్డులను సాధించబోతోంది. వరల్డ్ వైడ్ గా ఈ సినిమా ఈరోజుతో 800 కోట్ల క్లబ్బులో చేరనుంది. అలాగే ఈ మూవీ నైజాంలో 85 కోట్లు వసూలు చేసిన తొలి చిత్రంగా రికార్డు సాదించనుండి. అలాగే సీడెడ్‌లో 40 కోట్ల మార్క్ ను చేరుకోనుంది. ఈ రోజుతో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రెండు తెలుగు రాష్ట్రాల్లో కలిపి మూడు వందల కోట్ల గ్రాస్, రెండు వందల కోట్ల షేర్ వసూలు చేయనుంది.
Recent Comment