మెగా పవర్ స్టార్ రామ్‌చరణ్, యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోలుగా దర్శకధీరుడు రాజమౌళి తెరజిక్కించిన చిత్రం ‘ఆర్‌ఆర్‌ఆర్’. ఇక ఈ చిత్రం మార్చి 25న ప్రపంచ వ్యాప్తంగా భారీ స్థాయిలో విడుదల కాబోతున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో చిత్రబృందం ప్రమోషన్స్ వేగవంతం చేసింది. ఈ నేపథ్యంలోనే శనివారం రాత్రి కర్ణాటకలోని చిక్‌బళ్లాపుర్ వేదికగా ‘ఆర్ఆర్ఆర్’ చిత్రం ప్రీ రిలీజ్ ఈవెంట్ ఘనంగా జరిగింది.
ఈ సందర్భంగా దర్శకుడు రాజమౌళి మాట్లాడుతూ మెగా స్టార్ చిరంజీవిపై ప్రశంసల జల్లు కురిపించాడు. ‘ఆర్‌ఆర్‌ఆర్’ మూవీ తెలుగు సినీపరిశ్రమకి సినిమాకి గర్వకారణం అని గుర్తించి టికెట్ రేట్లు పెంచుకునేందుకు అనుమతిచ్చిన తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి,
ఆంద్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్‌రెడ్డిగారికి కృతజ్ఞతలు
మా సినిమా కోసం మెగాస్టార్ చిరంజీవి ప్రత్యేక చొరవ తీసుకుని ఏపీ సీఎం జగన్‌తో మాట్లాడటం వల్లే అక్కడ టికెట్ రేట్లు పెంపు సాధ్యమైంది.
మా ఆర్ఆర్ఆర్ సినిమా కోసం చిరంజీవి కష్టపడుతుంటే ఆయన్ని చాలా మంది చాలా రకాల మాటలు అన్నారు. కానీ మా అందరినీ గెలిపించాలని ఆయన ఆ మాటలన్నీ పడ్డారు. ఆయన అసలైన మెగాస్టార్. నిజానికి చిరంజీవిగారికి ఇండస్ట్రీ పెద్ద అనిపించుకోవటం నచ్చదు. కానీ, ఆయన ఎప్పటికీ ఇండస్ట్రీకి పెద్దనే అని రాజమౌళి చెప్పుకొచ్చారు.
Recent Comment