యువ కథానాయకుడు గోపిచంద్‌(Gopi Chand ) హీరోగా రాశీఖన్నా(Rashi Khanna) హీరోయిన్ గా మారుతి దర్శకత్వంలో తెరకెక్కబోతున్న చిత్రం ‘పక్కా కమర్షియల్‌’.(Pakka Commercial) మెగా ప్రొడ్యూస‌ర్ అల్లు అరవింద్‌ సమర్పణలో జీఏ2 పిక్చర్స్‌-యూవీ క్రియేషన్స్‌ బ్యానర్లపై బన్నీవాసు ఈ సినిమాను నిర్మిస్తున్నారు. గోపిచంద్ 29వ సినిమాగా, మారుతి 10వ సినిమాగా రాబోతున్న ఈ మూవీకి జేక్స్ బిజాయ్ సంగీతం అందిస్తుండగా.. క‌ర‌మ్ చావ్లా సినిమాటోగ్రాఫ‌ర్‌గా వ్యవహరిస్తున్నారు.

ఇప్పటికే విడుదలైన ఈ మూవీ టీజర్‌, ట్రైలర్లకు చక్కటి స్పందన లభించింది. ఇదిలా ఉంటే తాజాగా ఈమూవీ విడుదల తేదీ ప్రకటించారు చిత్రబృందం. జులై 1, 2022న పక్కా ఎంటర్‌టైన్‌మెంట్‌తో వస్తున్నామంటూ వెల్లడించారు. ఈ సినిమాలో సత్యరాజ్‌, జగపతి బాబులు కీలక పాత్రలు చేస్తున్న సంగతి తెలిసిందే. ‘ఔట్‌ అండ్‌ ఔట్‌ ఎంటర్‌టైనర్‌గా రూపొందుతోన్న ఈ చిత్రానికి సహనిర్మాత: ఎస్‌కేఎన్, లైన్‌ ప్రొడ్యూసర్‌: బాబు, ఎగ్జిక్యూటివ్‌ ప్రొడ్యూసర్‌: సత్యగమిడి