యంగ్ హీరో వరుణ్‌ తేజ్‌(Varun Tej) కథానాయకుడుగా కిరణ్‌ కొర్రపాటి దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా ‘గని’(Ghani). ఇందులో వరుణ్‌ తేజ్‌ కు జోడీగా బాలీవుడ్‌ నటి సయీ(Sayi Manjrekar) మంజ్రేక‌ర్ న‌టిస్తోంది. ఈ చిత్రం ఏప్రిల్ 8న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇక విడుదల తేదీ దగ్గరపడుతుండటంతో ప్రమోషన్‌ కార్యక్రమాలను వేగవంతం చేసింది చిత్రబృందం. ఈ క్రమంలోనే ఏప్రిల్ 2న విశాఖపట్నం వేదికగా ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను ఘనంగా నిర్వహించింది… అయితే తాజాగా తెలంగాణ ప్రభుత్వం ‘గని’ మేకర్స్ కు ఊహించని షాకిచ్చింది. రాష్ట్రంలో గని సినిమాకి సంబంధించి టికెట్ల ధరల్లో ఎలాంటి పెరుగుదల లేదని ప్రకటించింది.

ప్రస్తుతం ఉన్న ధరల ప్రకారమే ఈ సినిమా టికెట్ల రేట్లు ఉంటాయని తెలంగాణ సర్కారు వెల్లడించింది. తాజా నిబంధనల ప్రకారం మ‌ల్టీప్లెక్స్ లో రూ.200, జిఎస్‌టీ ఛార్జీలు క‌లిపి ఉంటాయి. అలాగే సింగిల్ స్క్రీన్స్ లో ఈ సినిమా టికెట్ ధ‌ర జిఎస్‌టితో క‌లిసి రూ.150గా నిర్ణ‌యించారు. కాగా, ఈ సినిమాకి థమన్ సంగీతం అందిస్తుండగా.. ఉపేంద్ర‌(Upendra), సునీల్ శెట్టి(Sunil Shetty), న‌వీన చంద్ర(Naveen Chandra), జగపతి బాబు(Jagapati Babu) త‌దిత‌రులు కీల‌క పాత్ర‌ల్లో కనిపించనున్నారు. ఈ చిత్రాన్ని అల్లు అరవింద్‌ సమర్పణలో అల్లు బాబీ, సిద్ధు ముద్ద నిర్మించారు. . కాగా, ఈ సినిమాలో వ‌రుణ్‌ తేజ్ ఇప్ప‌టి వ‌ర‌కు చేయ‌ని డిఫ‌రెంట్ క్యారెక్టర్‌లో సరికొత్త లుక్‌లో బాక్సర్‌గా అలరించబోతున్నాడు. అందులోని వరుణ్‌ తేజ్ మాస్‌ లుక్‌ ఇప‍్పటికే మెగా అభిమానులకు తెగ నచ్చేసింది.