దర్శకదిగ్గజం ఎస్‌ఎస్‌ రాజమౌళి(Rajamouli) దర్శకత్వంలో యంగ్‌ టైగర్‌ ఎన్టీఆర్‌(NTR), మెగా పవర్‌స్టార్‌ రామ్‌ చరణ్‌ (Ram Charan) కథానాయకులుగా తెరకెక్కించిన చిత్రం ‘ఆర్ఆర్ఆర్’ (RRR) మార్చి 25న ప్రపంచవ్యాప్తంగా విడుదలైంది. విడుదలైన తొలి రోజు నుంచే కలెక్షన్ల సునామీ సృష్టించిన ఈ సినిమా ఇప్పటికీ ప్రపంచవ్యాప్తంగా బాక్సఫీసు వద్ద ప్రభంజనం సృష్టిస్తోంది. ఈ 14 రోజుల్లో వరల్డ్ వైడ్ గా చూస్తే 535.21 కోట్ల షేర్‌, 967 కోట్ల గ్రాస్‌ కలెక్షన్లు రాబట్టింది. రిలీజ్ కు ముందు 451 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ చేసిన మూవీ ప్రస్తుతం 82.21 కోట్ల లాభాలతో కొనసాగుతోంది.

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో కలిపి తొలి వారం 187.65 కోట్ల షేర్ కలెక్షన్స్ రాబట్టిన ఆర్ఆర్ఆర్ రెండో వారంలో 61.11 కోట్ల షేర్ రాబట్టింది. ఈ క్రమంలోనే 40. 28 కోట్లతో ఉన్న బాహుబలి 2 రికార్డ్ బ్రేక్ చేసింది. ఇక రెండు తెలుగు రాష్ట్రాల్లో చూస్తే 14వ రోజుకు గాను రెండు రాష్ట్రాల్లో కలిపి1.86 కోట్ల షేర్, 3 కోట్ల గ్రాస్‌‌ కలెక్షన్స్ రాబట్టింది. మొత్తంగా ఈ సినిమా 14 రోజుల్లో చూస్తే 248.76 కోట్లషేర్, 374 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ వసూలు చేసింది.