ఢిల్లీ క్యాపిటల్స్, లక్నో సూపర్ జెయింట్స్ జట్ల మధ్య జరుగుతున్న మ్యాచ్ లో, లక్నో సూపర్ జెయింట్స్ జట్టు టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకుంది.  మొదట బ్యాటింగ్ చేసిన ఢిల్లీ క్యాపిటల్స్ 3 వికెట్ల నష్టానికి 149 పరుగులు చేసింది.

ఓపెనర్ ప్రిథ్వి షా చాల రోజుల తరవాత విలువైన ఇన్నింగ్స్ ఆడాడు.  Prithvi షా కేవలం 34 బంతుల్లో 61 పరుగులు చేశాడు. ఆ తరవాత వచ్చిన వార్నర్, పావెల్ వెంట వెంటనే అవుట్ అయ్యారు.  అయితే రిషబ్ పంత్, సర్ఫరాజ్ ఖాన్ నాలుగవ వికెట్ కు 75 పరుగులు జోడించారు. అయితే పృథ్వీ షా ఇచ్చిన శుభారంభాన్ని భారీ స్కోరు గా మలచడం లో రిషబ్ పంత్, సర్ఫరాజ్ ఖాన్ విఫలమయ్యారు.  రిషబ్ పంత్ 39 పరుగులు, సర్ఫరాజ్ ఖాన్ 36 పరుగుల తో అజేయం గా నిలిచారు.

లక్నో సూపర్ జెయింట్స్  బౌలర్ల లో, రవి బిష్ణోయ్ రెండు వికెట్లు తీయగా,గౌతమ్ ఒక వికెట్ తీశాడు