నటసింహం నందమూరి బాలయ్య(Bala Krishna) కథానాయకుడుగా యువ దర్శకుడు గోపిచంద్ మలినేని(Gopichand Malineni) ఓ సినిమా తెరకెక్కిస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమాలో బాలయ్య పవర్ ఫుల్ పాత్రలో ఆకట్టుకోనున్నాడు. మైత్రీ మూవీ మేకర్స్ పతాకంపై నవీన్ ఎర్నేని వై. రవిశంకర్ నిర్మిస్తున్న ఈ సినిమా ‘NBK107’ వర్కింగ్ టైటిల్ తో రూపొందుతోంది. బాలయ్యకు జోడీగా శ్రుతిహాసన్ కథానాయికగా నటిస్తున్న ఈ సినిమా ఇప్పటికే సిరిసిల్ల పరిసర ప్రాంతాల్లో ఓ షెడ్యూల్‌ను పూర్తిచేసుకుని మరో యాక్షన్ షెడ్యూల్‌ను కూడా ప్రారంభించింది.
అయితే తాజా సమాచారం ప్రకారం ఈ సినిమా కోసం రామోజీ ఫిల్మ్‌సిటీలో ప్రత్యేకంగా ఓ ఇంటి సెట్‌ని రూపొందించినట్లు తెలుస్తోంది. అక్కడే ఈ సినిమాలోని కీలక సన్నివేశాల్ని తెరకెక్కించాలని దర్శకుడు గోపిచంద్ మలినేని ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. ఈ సినిమాలో హీరో ఇంట్రడక్షన్ సీన్ నుంచి ముఖ్య సన్నివేశాల్ని ఈ షెడ్యూల్‌లో తెరకెక్కించనున్నారని, సినిమాలోని ప్రధాన పాత్రలు పోషించే వారందరు ఈ ఇషెడ్యూల్ లో పాల్గొననున్నారని సమాచారం. కాగా, ఈ సినిమాలో కన్నడ యాక్టర్ దునియా విజయ్ (Duniya Vijay) విలన్‌గా నటిస్తున్నాడు. అలాగే ఈ సినిమాలో బాలకృష్ణకు జోడిగా శ్రుతిహాసన్ నటిస్తోంది. వరలక్ష్మీ శరత్ కుమార్ కీలక పాత్రలో నటిస్తున్న ఈ సినిమాకు మ్యూజిక్ సెన్సేషన్ తమన్ సంగీతం అందిస్తున్నారు.
Recent Comment