నాచురల్‌ స్టార్‌ నాని(Nani) కథానాయకుడిగా యంగ్ డైరెక్టర్ వివేక్‌ ఆత్రేయ దర్శకత్వంలో రూపొందుతున్న సినిమా ‘అంటే సుందరానికి’.(Ante Sundaraniki ) ఇందులో నాని పాత్ర పేరు ‘కస్తూరి పూర్ణ వెంకట శేషసాయి పవన రామసుందర ప్రసాద్‌’. మైత్రీ మూవీ మేకర్స్‌ పతాకంపై తెరకెక్కిస్తున్న ఈ చిత్రానికి నవీన్‌ ఎర్నేని, రవిశంకర్‌ .వై నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. అలాగే చిత్రానికి వివేక్‌ సాగర్‌ సంగీతం అందిస్తున్నారు. ఫుల్ ఫ్యామిలీ అండ్ కామెడీ ఎంటర్టైనర్‌గా తెరకెక్కుతున్న ఈ సినిమాలో నానికి జోడిగా మలయాళ బ్యూటీ నజ్రియా నజీమ్ నటిస్తోంది.

ఈ మూవీలో నజ్రియా లీలా థామస్‌గా నటించనుంది. ఈ సినిమాను జూన్ 10వ తేదీన విడుదల చేసేందుకు చిత్రయూనిట్ సన్నాహాలు చేస్తున్నారు. ఇటీవల హీరోయిన్ ఫస్ట్ లుక్ వీడియోని విడుదల చేసిన చిత్ర యూనిట్. ఈ బుధవారం ఈ మూవీ నుంచి ఫస్ట్ సింగిల్ ని రిలీజ్ చేయబోతోంది. ఇందుకు సంబంధించిన ప్రోమోని మంగళవారం విడుదల చేసింది. ఇందులో పంచకట్టులో నాని ఎంతగానో ఆకట్టుకున్నాడు. ఈ మూవీ నుంచి ఫస్ట్ సింగిల్ గా పంచకట్టు .. అంటూ సాగే లిరికల్ వీడియోని బుధవారం సాయంత్రం 6 :03 నిమిషాలకు విడుదల చేయబోతోంది.