కన్నడ స్టార్‌ హీరో యశ్‌(Yash) కథానాయకుడుగా, సెన్సేషనల్ డైరెక్టర్ ప్రశాంత్‌ నీల్‌(Prashanth Neel) దర్శకత్వంలో రూపొందుతున్న పాన్‌ ఇండియా మూవీ “కేజీఎఫ్‌-2″(KGF Chapter 2) నాలుగేళ్ల కిందట బాక్సాఫీస్‌ రికార్డులను తిరగరాసిన కేజీఎఫ్‌ సినిమాకు సీక్వెల్‌గా ఈ సినిమా పాన్ ఇండియా లెవెల్లో తెరకెక్కుతోంది. ఈ చిత్రాన్ని హోంబలే ఫిలింస్‌ పతాకంపై విజయ్‌ కిరగందూర్ నిర్మిస్తున్నారు. కన్నడ, తెలుగు, తమిళ, హిందీ భాషల్లో కేజీఎఫ్‌ 2 వేసవి కానుకగా ఏప్రిల్ 14న విడుదల కానుంది.

అయితే తాజాగా KGF chapter 2 మూవీ ప్రమోషన్స్ లో భాగంగా చిత్రబృందం రెండు రోజులు పాటు తెలుగు రాష్ట్రాల్లో పర్యటిస్తోంది. ఏప్రిల్ 10న తిరుపతిలో జరిగిన ప్రెస్ మీట్ లో యశ్ పాల్గొన్నాడు. అయితే ఈ కార్యక్రమానికి తొలుత ప్రకటించిన సమయానికి యశ్ హాజరుకానలేకపోయాడు. ఈ క్రమంలోనే తనకోసం ఓపికగా ఎదురుచూసిన అభిమానులందరికీ ఆయన క్షమాపణలు చెప్పాడు. తాను రావాల్సిన విమానం ఆలస్యం అయిందని, అందుకే చెప్పిన సమయానికి రాలేకపోయానని యశ్ క్షమాపణలు కోరాడు. ఇక తెలుగు రాష్ట్రాల్లో ప్రమోషన్స్ లో భాగంగా ఈరోజు తిరుమలలో వెంకటేశ్వర స్వామిని దర్శించుకున్న అనంతరం యశ్ అక్కడి నుంచి సింహాచలం, విశాఖపట్నం, హైద్రాబాద్‌లలో జరిగే ఈవెంట్లలో పాల్గొననున్నాడు.