కన్నడ అగ్రకథానాయకుడు యశ్‌(Yash) ప్రధాన పాత్రలో స్టార్ డైరెక్టర్ ప్రశాంత్‌ నీల్‌(Prashanth Neel) దర్శకత్వంలో తెరకెక్కిన పాన్‌ ఇండియా సినిమా “కేజీఎఫ్‌-2″(KGF Chapter 2) 2018లో బాక్సాఫీస్‌ రికార్డులను తిరగరాసిన కేజీఎఫ్‌ సినిమాకు సీక్వెల్‌గా ఈ సినిమా పాన్ ఇండియా లెవెల్లో రూపొందింది.హోంబలే ఫిలింస్‌పై విజయ్‌ కిరగందూర్‌ నిర్మించిన ఈ సినిమాలో శ్రీనిధి శెట్టి హీరోయిన్‌గా నటించింది. విలన్‌ అధీరా పాత్రను ప్రముఖ బాలీవుడ్‌ హీరో సంజయ్‌ దత్‌ పోషించాడు.

అయితే ఎన్నో అంచనాల మధ్య ఏప్రిల్ 14న వరల్డ్ వైడ్ గా విడుదలైన ‘కేజీఎఫ్​-2’ మూవీ తొలి రోజు సూపర్​ హిట్ టాక్​​ తెచ్చుకుంది. బాక్సాఫీస్​ను షేక్​ చేస్తూ అంచనాలకు మించి కలెక్షన్లను రాబడుతోంది. తొలిరోజు 134.5 కోట్ల రూపాయల కలెక్షన్లను సాధించిన ఈ సినిమా రెండో రోజు కూడా దుమ్మురేపింది. మొత్తంగా రెండు రోజుల్లో ఈ సినిమా 240 కోట్ల కలెక్షన్స్ వసూలు చేసి సరికొత్త రికార్డు సాధించింది.
తెలుగులో మొదటి రోజు రూ.19.5 కోట్ల షేర్‌ సాధించిన ఈ సినిమా రెండో రోజు రూ.12.95 కోట్లను వసూలు చేసింది. ఇక బాలీవుడ్‌లోనూ కేజీయఫ్‌ 2 మూవీ తొలి రోజే రూ.50 కోట్లు రాబట్టగా.. రెండో రోజు దాదాపు 45 కోట్లు వసూలు చేసింది. అలాగే త‌మిళ‌నాడులో రూ.8 కోట్లు, కేర‌ళ‌లో రూ.5.50 కోట్లు గ్రాస్ క‌లెక్ష‌న్స్‌ రాబట్టింది.