దర్శకదిగ్గజం ఎస్‌ఎస్‌ రాజమౌళి(Rajamouli) దర్శకత్వంలో యంగ్‌ టైగర్‌ ఎన్టీఆర్‌(NTR), మెగా పవర్‌స్టార్‌ రామ్‌ చరణ్‌(Ram Charan) హీరోలుగా తెరకెక్కించిన చిత్రం ‘ఆర్ఆర్ఆర్’ (RRR) మార్చి 25న ప్రపంచవ్యాప్తంగా విడుదలైంది. ఈ సినిమాను చూసేందుకు అభిమానులు థియేటర్లకు క్యూ కడుతున్నారు. అయితే తొలి వారం రోజుల్లోనే కలెక్షన్ల సునామీ సృష్టించిన ఈ సినిమా 10 రోజుల్లోనే బ్రేక్ ఈవెన్ ను పూర్తి చేసి లాభాల వైపు పరుగులు తీస్తోంది. ఈ నేపథ్యంలో మరి ఈ పది రోజుల్లో ఆర్ఆర్ఆర్ సినిమా క‌లెక్ష‌న్లు ఎలా ఉన్నాయో ఇప్పుడు చూద్దాం…

(తెలంగాణ+ఆంధ్రప్రదేశ్) రాష్ట్రాల్లో ఆర్ఆర్ఆర్ రోజూ వారి కలెక్షన్స్ రిపోర్ట్..

★తొలి రోజు – 74.11 కోట్లు
★రెండో రోజు – 31.63 కోట్లు
★ మూడో రోజు – 33.53 కోట్లు
★ నాలుగో రోజు – 17.73 కోట్లు
★ ఐదో రోజు – 13.63 కోట్లు
★ ఆరో రోజు – 9.54 కోట్లు
★ ఏడో రోజు – 7.48 కోట్లు
★ ఎనిమిదో రోజు – 8.33 కోట్లు
★ తొమ్మిదో రోజు – 19.62 కోట్లు
★ పదో రోజు – 16.10 కోట్లు

మొత్తంగా చూస్తే ఆర్ఆర్ఆర్ సినిమా ప్రపంచవ్యాప్తంగా కలిపి 10 రోజుల్లో 496.80 కోట్లు షేర్‌, ( 900 కోట్ల గ్రాస్‌) కలెక్షన్లు రాబట్టింది. అలాగే ఈ సినిమా హిందీలో 91.10 కోట్లు,కర్నాటకలో 37.15 కోట్లు ,రెస్ట్ ఆఫ్ ఇండియాలో 6.90 కోట్లు, అలాగే తమిళనాడులో 33.70 కోట్లు, కేరళలో 9.25 కోట్లు, ఓవర్సీస్‌లో84.20 వసూలు చేసింది.