మెగాస్టార్‌ చిరంజీవి ( Chiranjeevi ) హీరోగా డైరెక్టర్ కొరటాల శివ( Koratala Shiva ) దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘ఆచార్య'(Acharya). మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ( Ram Charan ) ఇందులో కీలక పాత్ర పోషిస్తున్నాడు. ఈ సినిమాలో చిరంజీవికి జోడీగా చందమామ కాజల్ హీరోయిన్‌గా నటించగా.. రామ్‌ చరణ్‌కు జంటగా బుట్టబొమ్మ పూజా హెగ్డే నటించింది. అలాగే సోనూసూద్‌ ముఖ్య పాత్ర పోషించాడు. రామ్‌చరణ్, నిరంజన్‌ రెడ్డి, అన్వేష్‌ రెడ్డి నిర్మించిన ఈ చిత్రం ఏప్రిల్‌ 29న ప్రేక్షకుల ముందుకు రానుంది.

అయితే ఈ సినిమా థియేట్రికల్ ట్రైలర్ మంగళవారం రోజు సాయంత్రం విడుదల విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఇందులో చిరంజీవి, రామ్‌ చరణ్‌ తమదైన నటనతో అదరగొట్టారు. అయితే తాజాగా ఈ ట్రైలర్ ఆల్ టైం రికార్డు సాధించింది. ఇప్పటికే ఆచార్య ట్రైలర్ వ్యూస్ పరంగా దుమ్మురేపగా.. ఇప్పుడు లైక్స్ లో కూడా మెగా స్టార్ తన స్టామినాని చూపించారు. తాజాగా ఆచార్య ట్రైలర్ ఫాస్టెస్ట్ వన్ మిలియన్ లైక్డ్ వీడియో గా అరుదైన రికార్డు క్రియేట్ చేసింది. విడుదలకు ముందే ఇన్ని రికార్డులను సాధిస్తున్న చిరు ‘ఆచార్య’ విడుదల తరువాత మరిన్ని ఘనతలు సాధిస్తుందో అన్నది చూడాలి.