మాస్‌ మహారాజ రవితేజ( Raviteja) నటించిన తాజా చిత్రం రామారావు ఆన్‌డ్యూటీ. (Rama Rao On Duty) ఈ సినిమా జూన్‌ 17న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. కాగా శరత్‌ మండవ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో దివ్యాంశ కౌశిక్‌, రజిషా విజయన్‌ హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఈ సినిమాతో వేణు తొట్టెంపూడి రీఎంట్రీ ఇస్తున్నాడు. నాజర్‌, తనికెళ్ల భరణి, పవిత్రాల ఓకేశ్‌ ముఖ్యపాత్రల్లో నటించారు.

అయితే తాజాగా ఈ సినిమాలోని ఫస్ట్ సింగిల్ ను విడుదల చేస్తున్నట్లు చిత్ర యూనిట్ ప్రకటించారు. సామ్ సీఎస్ సంగీతం అందించిన ఈ సినిమా నుంచి ఫస్ట్ సింగిల్ ‘బుల్ బుల్ తరంగ్’​ను ఏప్రిల్ 10న విడుదల చేయబోతున్నట్లు తెలిపారు. రవితేజ, రజిషా విజయన్ పై ఈ సాంగ్ ను షూట్ చేశారు. తాజాగా విడుదల చేసిన పోస్ట‌ర్‌లో ర‌వితేజ‌, రజీషాలు కండువ‌ను మెడ‌పై వేసుకొని ఒక‌రినొక‌రు చూసుకుంటున్న‌ట్లు ఉన్నారు. కాగా, సుధాకర్‌ చెరుకూరి నిర్మించిన ఈ సినిమాలో రవితేజ డిప్యూటీ కలెక్టర్‌గా కనిపించనున్నాడు.