చరిత్రలో ఇద్దరు గొప్ప పోరాట యోధులు సమాజ క్షేమం కోసం కలిస్తే ఎలా ఉంటుంది? అన్న డిఫరెంట్ కాన్సెప్ట్ తో తెరకెక్కిన చిత్రం ఆర్‌ఆర్‌ఆర్‌(రౌద్రం రణం రుధిరం)(RRR). ఇందులో కొమురం భీమ్‌గా యంగ్ టైగర్ ఎన్టీఆర్‌(NTR), అల్లూరి సీతారామరాజుగా మెగా పవర్ స్టార్ రామ్‌చరణ్‌(RAM CHARAN) నటిస్తున్నారు. పాన్‌ఇండియా లెవెల్లో రూపొందుతున్న ఈ సినిమాలో రామ్ చరణ్ కు జోడిగా ఆలియా భట్‌(ALIA BHATT) నటిస్తుండగా.. ఎన్టీఆర్ కు జోడీగా హాలీవుడ్‌ నటి ఒలీవియా మోరిస్‌ నటించనున్నారు.

ఈ చిత్రం మార్చి 25, 2022న ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుండగా.. ఇలాంటి సమయంలో ఆర్ఆర్ఆర్ సినిమాపై దుబాయ్‌కి చెందిన సినీ విమర్శకుడు.. సెన్సార్ బోర్డ్ సభ్యుడు ఉమైర్ సంధు తాను తాజాగా ఈ సినిమా చూశాన‌ని చెబుతూ తొలి రివ్యూను ట్విట్టర్ వేదికగా పోస్ట్ చేశారు. ‘‘ఆర్ఆర్ఆర్ మూవీలో యంగ్ టైగర్ ఎన్టీఆర్ పాత్ర గుండె కాయ లాంటిది. ఇక రామ్ చర‌ణ్ త‌న న‌ట‌ విశ్వరూపంతో దుమ్మురేపాడు వీరిద్దరూ కలిసి బాక్సాఫీస్ వద్ద సరికొత్త చరిత్ర సృష్టించడం ఖాయం. ఇక యావత్ సినీ ప్రపంచం గ‌ర్వ‌ప‌డేలా ఆర్ఆర్ఆర్ సినిమాను దర్శకుడు రాజ‌మౌళి తెరకెక్కించారు”. అని ఉమైర్ సంధు చెప్పుకొచ్చారు.