తెలుగు సినీ పరిశ్రమలో తిరుగు లేని హీరో మెగాస్టార్ చిరంజీవి(Chiranjeevi). ఆయ‌న సినిమా విడుదలైంది అంటే బాక్సాఫీస్ రికార్డులు బద్దలవ్వాల్సిందే. అంత‌టి క్రేజ్ ఉన్న చిరంజీవి ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్నారు. ఇప్ప‌టికే ఆచార్య(Acharya) సినిమాను విడుదలకు సిద్ధం చేసిన చిరంజీవి మోహన్ రాజా దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘గాడ్ ఫాద‌ర్'(Godfather) సినిమాను పూర్తి చేసే ప‌నిలో బిజీగా ఉన్నారు. అలాగే మెహ‌ర్ ర‌మేష్ ద‌ర్శ‌క‌త్వంలో తెరకెక్కుతున్న భోళా శంక‌ర్‌, బాబి ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కుతోన్న మ‌రో సినిమా సెట్స్‌పై ఉంది. యువ దర్శకుడు వెంకీ కుడుముల ద‌ర్శ‌క‌త్వంలో మూవీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.

ఇవ‌న్నీ కాకుండానే మరో మలయాళ మూవీ తెలుగు రీమేక్ లో చిరంజీవి నటించనున్నట్లు సమాచారం. మలయాళ సూపర్ స్టార్లు మోహన్‌లాల్, పృథ్వీరాజ్‌ సుకుమారన్‌లు కలిసి నటించిన మలయాళ మూవీ ‘బ్రో డాడీ’. ప్రథ్వీ రాజ్ దర్శకత్వంలో రూపొందిన ఈ మూవీ ఇటీవల ఓటీటీలో విడుదలై అద్బుత విజయం సాధించింది. ఈ సినిమా తెలుగులో రీమేక్‌ కానుందని, ఇందులో మోహన్‌లాల్‌ చేసిన పాత్రను తెలుగులో చిరంజీవి చేయనున్నారనే ఇండస్ట్రీలో టాక్ వినిపిస్తోంది. దీనిపై త్వరలోనే అధికారిక ప్రకటన రానున్నట్లు తెలుస్తోంది.