పవర్​ స్టార్ పవన్​ కల్యాణ్(Pawan Kalyan)​ కథానాయకుడుగా రూపొందుతున్న తాజా చిత్రం ‘హరిహర వీరమల్లు'(Hari hara Viramallu). సీనియర్ డైరెక్టర్‌ క్రిష్‌ జాగర్లమూడి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా మొఘల్‌ సామ్రాజ్యం నేపథ్యంలో 17వ శతాబ్దపు కథతో ఈ తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. మెగా సూర్య ప్రొడక్షన్స్​ బ్యానర్​పై ప్రముఖ నిర్మాత ఏంఎం రత్నం నిర్మిస్తున్న ఈ సినిమాలో హీరోయిన్​గా నిధి అగర్వాల్​ నటిస్తోంది. ఔరంగజేబు పాత్రలో అర్జున్ రాంపాల్, బాలీవుడ్​ ముద్దుగుమ్మ జాక్వెలిన్​ ఫెర్నాండెజ్​​ కనువిందు చేయనుంది. కరోనా మహమ్మారి కారణంగా వాయిదాపడిన ఈ సినిమా షూటింగును తిరిగి ఇటీవలే ప్రారంభించారు మేకర్స్.

ఇప్పటికే చాలా ఆలస్యమైన కారణంగా ఈ సినిమా షూటింగ్​ ను సాధ్యమైనంత త్వరగా పూర్తిచేయాలని చిత్రబృందం భావిస్తున్నారట. ఈ క్రమంలోనే ‘హరిహర వీరమల్లు’ సెట్స్ లో పవన్ కళ్యాణ్ అడుగుపెట్టారు. అయితే ఈ చిత్రానికి కళాదర్శకులుగా వ్యవహరిస్తున్న పద్మశ్రీ తోట తరణి గారిని హరిహర వీరమల్లు షూటింగ్ స్పాట్ కి లోకి ఆహ్వానిస్తూ పవన్ కళ్యాణ్ పుష్పగుచ్చం అందించ స్వాగతం పలికారు. పద్మశ్రీ అవార్డు, జాతీయస్థాయి ఉత్తమ కళాదర్శక అవార్డులు అందుకున్న తోట తరణి గారు ఈ సినిమాకు పనిచేయడం ఎంతో ఆనందాన్ని కలిగిస్తోందని ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ అన్నారు.