యావత్‌ భారతదేశం ఎంతగానో ఎదురుచూస్తున్న ఆర్ఆర్ఆర్ చిత్రం మార్చి 25న ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇందులో మెగా ప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్, యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్ న‌టించ‌డంతో ఈ సినిమా పై అంచ‌నాలు భారీగా ఏర్ప‌డ్డాయి. అన్ని అవరోధాలు దాటుకుని ఆర్ఆర్ఆర్ మార్చి 25న ప్ర‌పంచ వ్యాప్తంగా ప్రేక్ష‌కుల ముందుకు రానుంది. ఈ సినిమా ఎలా ఉండ‌బోతుంది అనేది ఆస‌క్తిగా మారింది.

ఇది ఒక యాక్షన్ డ్రామా. సినిమాలో రొమాంటిక్ సీన్లకి చోటులేదు. యుగళ గీతాల్లేవు. మరి అంతా ఫైట్లేనా? అంటే.. ఈ సినిమాలో ఎమోషన్ ప్రధానం. ఫైట్ సన్నివేశాల్లోనూ ఎమోషన్ ఉంటుంది. సినిమా మొత్తం రామ్ చరణ్, ఎన్టీఆర్ ఉంటారు. వారి స్నేహం, వారి లక్ష్యం ఈ కథకి బలం. అని రాజమౌళి ఒక ఇంటర్వ్యూలో చెప్పారు. ఇక రామ్ చరణ్ ఇంట్రడిక్షన్, ఎన్టీఆర్ ఇంట్రడిక్షన్ తో పాటు రెండు ఫైట్స్ ఈ సినిమాకి హైలెట్ అవుతాయి అనే మాట వినిపిస్తోంది.

ఇంటర్వెల్ కి ముందు వచ్చే ఫైట్ సినిమా మొత్తానికే ఆకర్షణ. ఛత్రపతి కానీ, మగధీర కానీ, బాహుబలి కానీ… రాజమౌళి సినిమాలో ఇంటర్వెల్ బ్యాంగ్ ప్రత్యేకంగా నిలుస్తాయి. ఈ సినిమాలో కూడా ఇంటర్వెల్ బ్యాంగ్ రోమాలు నిక్కబొడుచుకునేలా చేస్తుందట. ఆ క్లిప్ ఒకటి ట్రైలర్ లో కూడా చూపించారు రాజమౌళి. ఇక 20 నిముషాలు సాగే క్లయిమాక్స్ అందరికి సంతృప్తి కలిగిస్తుందట. ఈ రెండు పెద్ద ఫైట్స్ చాలు పైసా వసూల్ కావడానికి అని చెబుతున్నారు. ఈ మాటలో నిజమెంత అనేది వెండి తెరపై చూడాలి.