మాస్ మహరాజ్ రవితేజ, యువ కథానాయిక శ్రీలీల జంటగా నటిస్తున్న తాజా చిత్రం ‘ధమాకా’. త్రినాథరావు నక్కిన దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఈ సినిమాని పీపుల్‌ మీడియా ఫ్యాక్టరీ, అభిషేక్‌ అగర్వాల్‌ ఆర్ట్స్‌పై టీజీ విశ్వ ప్రసాద్‌ నిర్మిస్తున్నారు. అయితే తాజాగా ఈ మూవీ స్టోరీలైన్ లీక్ ఇదే అంటూ సోషల్ మీడియాలో ఓ స్టొరీ వైరల్ అవుతుంది. తాజా సమాచారం ప్రకారం ఈ చిత్రంలో రవితేజ డ్యూయల్ రోల్స్ పోషిస్తున్నట్లు తెలుస్తోంది.

ఇందులో ఓ బడా కంపెనీకి ఓనర్ పాత్రలో రవితేజ కనిపించనుండగా… ఓ మిడిల్ క్లాస్ వ్యక్తిగా మరో పాత్రలో కనిపించబోతున్నారట. అయితే ఓ వివాదంలో బడా బిజినెస్ మెన్ ను రౌడీలు కిడ్నాప్ చేయబోయి మిడిల్ క్లాస్ వ్యక్తిని కిడ్నాప్ చేస్తారట. ఈ సంఘటన చుట్టే ఈ సినిమాలో కథ తిరుగుగుతుందని అంటున్నారు. ఇక మరోవైపు ఇప్పటికే రవితేజ నటించిన ‘రామారావు ఆన్ డ్యూటీ’ సినిమాను జూన్ 17న విడుదల చేస్తున్నట్లు ప్రకటించారు.