పెళ్లి చూపులు, అర్జున్‌రెడ్డి, గీతా గోవిందం సినిమాలతో సూపర్ హిట్‌లు కొట్టిన విజయ్‌ దేవరకొండ తన కంటూ ఒక క్రేజ్ సంపాదించుకున్నాడు. ప్రస్తుతం విజయ్‌ దేవరకొండ(Vijay Devarakonda) సీనియర్ డైరెక్టర్ పూరి జగన్నాథ్‌ దర్శకత్వంలో లైగర్‌(Liger) సినిమా చేస్తున్నాడు. పాన్‌ ఇండియా లెవెల్లో తెరకెక్కుతున్న ఈ చిత్రంపై భారీ అంచనాలు ఉన్నాయి. ధర్మ ప్రొడక్షన్స్- పూరి కనెక్ట్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న లైగర్‌ సినిమా ఆగస్ట్‌25న ప్రేక్షకుల ముందుకు రానుంది.

అయితే లైగర్‌ సినిమా చిత్రీకరణ ముగిసిన తర్వాత విజయ్‌ దేవరకొండ టాలెంటెడ్ డైరెక్టర్ శివ నిర్వాణ దర్శకత్వంలో ఓ సినిమా చేయనున్నాడు. అయితే తాజా సమాచారం ప్రకారం ఈ సినిమాలో సమంత(Samantha) హీరోయిన్‌గా నటించనున్నట్లు తెలుస్తుంది. ఈ సినిమా రెగ్యులర్‌ షూటింగ్‌ ఏప్రిల్‌లో ఆరంభం కానుండగా.. ఇది కశ్మీర్‌ నేపథ్యంలో సాగే ప్రేమ కథ అని, ఈ సినిమాలో విజయ్‌ దేవరకొండ మిలటరీ ఆఫీసర్‌గా కనిపించనున్నారని సమాచారం. హార్ట్‌ టచింగ్, ఎమోషనల్‌ డ్రామాలతో కట్టిపడేసే శివ నిర్వాణ ఈ సినిమాను ఎలా రూపొందిస్తాడో అన్నది చూడాలి మరి.