మెగాస్టార్‌ చిరంజీవి ( Chiranjeevi ) హీరోగా కొరటాల శివ( Koratala Shiva ) దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం ‘ఆచార్య'(Acharya). మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ( Ram Charan ) ఇందులో ముఖ్య పాత్ర పోషిస్తున్నాడు. ఈ సినిమాలో చిరంజీవికి జోడీగా చందమామ కాజల్ హీరోయిన్‌గా నటించగా.. రామ్‌ చరణ్‌కు జంటగా బుట్టబొమ్మ పూజా హెగ్డే నటించింది. అలాగే సోనూసూద్‌ ముఖ్య పాత్ర పోషించాడు. రామ్‌చరణ్, నిరంజన్‌ రెడ్డి, అన్వేష్‌ రెడ్డి నిర్మించిన ఈ చిత్రం ఏప్రిల్‌ 29న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇప్ప‌టికే ఈ సినిమా నుంచి విడుద‌లై ట్రైలర్, టీజ‌ర్ అభిమానుల్లో భారీ అంచ‌నాలను పెంచేశాయి.

అయితే ఈ సినిమా విడుద‌ల తేదీ దగ్గరపడుతుండడంతో చిత్రయూనిట్ ప్రమోషన్స్ వేగవంతం చేశారు. ఈ క్ర‌మంలో ఆచార్య ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను ఏప్రిల్ 23న విజ‌యవాడ‌లోని సిద్దార్థ జూనియ‌ర్ కాలేజ్‌లో నిర్వహించ‌నున్నారు. అయితే ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఆంద్ర్రప్రదేశ్ మైక్యమంత్రి వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి రానున్నట్లు సమాచారం. నిజానికి సీఎం జగన్, చిరంజీవి మధ్య స్నేహపూర్వక సంబంధాలే ఉన్నాయి. ఈ కారణంగానే చిరంజీవి తన సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు ఆహ్వానించాడని, చిరంజీవి ఆహ్వానాన్ని మన్నించి జగన్ కూడా ఈ కార్యక్రమానికి రాబోతోన్నాడని సమాచారం