పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ (Prabhas) హీరోగా టాలెంటెడ్ డైరెక్టర్ నాగ్ అశ్విన్(Nag Ashwin) దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా ‘ప్రాజెక్ట్ కె’. దీపికా పదుకోన్ హీరోయిన్‌గా నటిస్తుండగా, అమితాబ్ బచ్చన్ ఓ కీలక పాత్ర చేస్తున్నారు. ప్రముఖ నిర్మాణ సంస్థ వైజయంతీ మూవీస్ భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్న ఈ పాన్ ఇండియా చిత్రం 2022లో ప్రపంచవ్యాప్తంగా పలు భాషల్లో విడుదల కానుంది.
అయితే తాజాగా ఈ సినిమాకు సంబంధించిన ఓ ఆసక్తికర వార్త ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది. ఈ సినిమా ఇప్పటికే రెండు కీలక షెడ్యూల్స్ పూర్తి చేసుకున్న విషయం తెలిసిందే. తాజా సమాచారం ప్రకారం ఈ సినిమాలో అమితాబ్ బచ్చన్ ప్రభాస్ తండ్రి పాత్రలో, ఒక బడా బిజినెస్ మెన్ గా కనిపించనున్నాడని ఇండస్ట్రీలో జోరుగా టాక్ వినిపిస్తోంది. పాన్ వరల్డ్ మూవీ గా రూపొందుతున్న ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి.
Recent Comment