ఈ మధ్యనే  బైజూస్ (Byju’s) లో ఉద్యోగులను తొలగించిన విషయం తెలిసిందే.   బైజూస్ కార్యకలాపాలను సైతం తగ్గించుకుంటూ వస్తోంది.  ఇప్పుడు జీ చానెల్స్(Zee) వారు కూడా ఉద్యోగులను తొలగిస్తున్నారు.

సోనీ (Sony) తో విలీన ఒప్పందం రద్దు తరవాత జీ కంపెనీ మరింత ఇబ్బందుల్లో పడింది.   కంపెనీ నిర్వహణకు ఖర్చుల తగ్గింపు చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా ఉద్యోగులను కూడా తొలగిస్తోంది

కంటెంట్ విభాగాధిపతి పునీత్ మిశ్రా, అమ్మకాల విభాగాధిపతి రాహుల్ జోహ్రి వారి ఉద్యోగాలకు రాజీనామా చేశారు.  ఆ తరవాత జీ చానెల్స్ (Zee Channels) వారు సుమారు 70 -90 మంది ఉద్యోగులను తొలగించినట్లు తెలుస్తోంది. ZEE5 నిర్వహణ భారంగా మారింది.   ప్రస్తుతం జీ షేర్ (Zeel Share Price) ధర  150 రూపాయల కిందకు పది పోయింది.  ఆర్ధిక వ్యవహారాల దిద్దుబాటు ప్రక్రియల లో ఉద్యోగుల తొలగింపు అనివార్యమని తెలుస్తోంది.

పోటీ వాతావరణంలో ఖర్చులు నియంత్రించుకోలేకపోవడం, ఆదాయంలో వృద్ధి అంతగా లేకపోవడం, జీ వారు చేసిన పెద్ద తప్పిదం. స్టార్ ఇండియా (Star India) వారు జీ చానెల్స్ కు గట్టి పోటీ ఇస్తున్నారు.

మార్కెట్ లో పరిస్థితులు సరిగా లేని ఈ తరుణం లో , ఇంతమంది ఉద్యోగులను తొలగించడం దారుణం.  తొలగింపబడిన ఉద్యోగులందరికీ ఎదో ఒక రకమైన ఉపాధి దొరకాలని ఆశిద్దాం. 

అయితే ఇక్కడ ఆలోంచించవలసిన విషయం ఏమిటంటే, కీలక నిర్ణయాలు తీసుకునే బాస్ లు Leadership  స్థానం లో ఉన్న వారు తీసుకుంటారు.  నియామకాల ప్రక్రియ మానవ వనరుల విభాగం చూసుకుంటుంది.  వీరిద్దరి తప్పిదం వలన ఇంతమంది ఉద్యోగాలు పోవడం లేదా తీసివేయడం ఎంతవరకు సమంజసం

తప్పు ఎక్కడ జరుగుతోంది అనేది అందరు ఆలోచించాల్సిన్స్ అవసరం ఉంది. 

ఈ మధ్య చాలా కంపెనీ లు ఉద్యోగులను తొలగిస్తోంది.   అది ఆ ప్రక్రియ చాలా వేగం గా చేస్తోంది.

భారత ఆర్ధిక వ్యవస్థకు, జాబ్ మార్కెట్ కు ఇది మంచి పరిణామం కాదు