దర్శకధీరుడు రాజమౌళి(Rajamouli), యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్(Ntr), మెగా పవర్ స్టార్ రామ్‌చరణ్(Ram Charan) ల కాంబినేష‌న్లో తెరకెక్కిన చిత్రం “ఆర్ఆర్ఆర్”.ఇందులో కొమురం భీమ్‌గా యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్‌.. అల్లూరి సీతా రామరాజుగా మెగా ప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్ న‌టించారు. డీవీవీ ఎంటర్‏టైన్మెంట్స్, పెన్ స్టూడియోస్, లైకా సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమా మార్చి 25న ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకువచ్చింది. ఇదిలా ఉంటే, ఇప్పుడు ఆర్ఆర్ఆర్ మూవీ ఓటీటీ విడుదల తేదీపై సర్వత్రా ఆసక్తి నెలకొంది.

అయితే ఈ తాజా సమాచారం ప్రకారం ఆర్‌ఆర్‌ఆర్‌ మూవీ తెలుగు, తమిళం, కన్నడ వెర్షన్‌ను మరికొన్ని రోజుల్లోనే ఓటీటీకితీసుకొచ్చేందుకు సన్నాహకాలు చేస్తున్నారట. ఈ క్రమంలో మే 25వ తేదీ నుంచి సౌత్ ఇండియన్ లాంగ్వేజెస్ లో ఈ సినిమాని స్ట్రీమింగ్‌ చేసేందుకు జీ5 సంస్థ ప్రణాళికలు రచిస్తున్నట్లుగా తెలుస్తోంది. మరికొన్ని రోజుల్లోనే ఈ విషయంపై దీనిపై అధికారిక ప్రకటన రానున్నట్లు సమాచారం. ఇక ఆర్‌ఆర్‌ఆర్‌ మూవీ హిందీ వెర్షన్‌ను నెటిఫ్లిక్స్‌లో జూన్‌ నెల రెండో వారంలో స్ట్రీమింగ్‌ చేయనున్నట్లు తెలుస్తోంది.