పవర్ స్టార్ పవన్ కల్యాణ్( Pawan Kalyan), యంగ్ హీరో రానా దగ్గుబాటి (Rana Daggubati) నటించిన చిత్రం “భీమ్లా నాయక్”( Bheemla Nayak). ఫిబ్రవరి 25వ తేదీన విడుదలైన ఈ సినిమా సూపర్ హిట్ టాక్ తో దూసుకుపోతోంది. కాగా, సాగర్ చంద్ర దర్శకత్వంలో తెరకెక్కిన ఈ మూవీలో నిత్యా మీనన్ , సంయుక్త మీనన్ కథానాయికలుగా నటించారు. మలయాళ సూపర్ హిట్ మూవీ ‘అయ్యప్పనుమ్ కోషియమ్’ తెలుగు రీమేక్‌గా సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై సూర్యదేవర నాగవంశీ ఈ చిత్రాన్ని నిర్మించారు.
అలాగే “భీమ్లా నాయక్” సినిమా మార్చి 25న ఓటీటీ విడుదలకు కూడా సిద్ధంగా ఉందని ఇటీవల మేకర్స్ ప్రకటించారు. మార్చి25న ఈ సినిమాని ఒకేసారి డిస్నీ+ హాట్‌స్టార్‌తో పాటు ఆహాలో విడుదల చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించారు. దీంతో ఆ డేట్ కోసం పవన్ కళ్యాణ్ అభిమానులు ఆతృతగా ఎదురుచూస్తుండగా.. తాజాగా భీమ్లా నాయక్ మూవీని మార్చి 24 నుంచే ఓటీటీలోకి తీసుకొస్తున్నట్లు ప్రకటించారు.
ఆర్ఆర్ఆర్ సినిమా మార్చి 25న రిలీజ్ కానుండడంతోనే భీమ్లా నాయక్ సినిమాను ముందే రిలీజ్ చేస్తున్నట్లు సమాచారం.
Recent Comment