మెగాస్టార్‌ చిరంజీవి(Chiranjeevi) కథానాయకుడిగా, టాలెంటెడ్ డైరెక్టర్ కొరటాల శివ (Koratala Shiva) దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం ‘ఆచార్య’(Acharya) ఇందులో మెగా పవర్‌ స్టార్‌ రామ్‌ చరణ్‌ కీలక పాత్ర పోషిస్తున్న సంగతి తెలిసిందే. కాజల్‌ అగర్వాల్‌ హీరోయిన్ గా నటించిన ఈ మూవీలో రామ్‌చరణ్ కు జోడీగా పూజాహెగ్డే నటించారు. అయితే ‘ఆచార్య’ సినిమాలో జబర్దస్త్ యాంకర్ అనసూయ కీలక పాత్ర పోషించనున్న సంగతి తెలిసిందే.

అయితే తాజా సమాచారం ప్రకారం ఇందులో అనసూయ పాత్ర ప్రత్యేక ఆకర్షణగా నిలువనుందనే వార్తలు వినిపిస్తున్నాయి. ఈ సినిమాలో ఆమె పాత్రను గెటప్ ను మునుపెన్నడూ లేని విధంగా తీర్చిదిద్దారట దర్శకుడు కొరటాల శివ. అలాగే అనసూయ పోషిస్తున్న పాత్ర ఆమె కెరీర్ లోనే బెస్ట్ గా నిలువనుందని తెలుస్తోంది. ఇక ఆచార్య సినిమాలో తాను పోషిస్తున్న పాత్రకు గాను ఆమె రూ. 25 లక్షల వరకు పారితోషికం అనుడుకున్నట్లు సమాచారం. కాగా, ‘ఆచార్య’ సినిమాకు మణిశర్మ సంగీతం అందించారు.కొణిదెల ప్రొడక్షన్‌ కంపెనీ సమర్పణలో మ్యాట్నీ ఎంటర్‌టైన్‌మెంట్స్‌ పతాకంపై నిరంజన్‌రెడ్డి నిర్మిస్తున్న ఈ చిత్రం ఏప్రిల్‌ 29న విడుదల కానుంది.