మల్లి అంకం దర్శకత్వంలో అల్లరి నరేష్ నటిస్తున్న కామెడీ యాక్షన్ చిత్రం ‘ఆ ఒక్కటి అడక్కు’. ఫరియా అబ్దుల్లా కథానాయిక. హైదరాబాద్ లో జరిగిన ఒక ఈవెంట్ లో నేచురల్ స్టార్ నాని ఆ ఒక్కటి అడక్కు ట్రైలర్ విడుదల చేసారు.
చిలక ప్రొడక్షన్స్ పై రాజీవ్ చిలక నిర్మిస్తున్న ఈ చిత్రం May 3 న విడుదలకు సిద్ధమవుతోంది. ఈ సినిమాకి గోపి సుందర్ సంగీతాన్ని అందించారు. చాలా రోజుల తరవాత నంది, ఉగ్రం లాంటి సినిమాల తరవాత అల్లరి నరేష్ చేస్తున్న కామెడీ చిత్రం.
గతంలో అల్లరి నరేష్ తండ్రి, ఇ వి వి సత్యన్నారాయణ గారు రాజేంద్ర ప్రసాద్ తో తీసిన ‘ఆ ఒక్కటి అడక్కు,సూపర్ హిట్ కామెడీ ఎంటర్టైనర్ గా నిలిచింది
మరి అల్లరి నరేష్ కూడా ‘ఆ ఒక్కటి అడక్కు తో మరోసారి మనల్ని అలరించడానికి సిద్ధమవుతున్నాడు
Recent Comment