ఇండస్ట్రీలోకి ‘వకీల్ సాబ్’ సినిమాతో రీఎంట్రీ ఇచ్చిన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ( Pawan Kalyan ) ఇటీవల ‘భీమ్లా నాయక్’ మూవీతో బ్లాక్ సూపర్ హిట్ ను ఖాతాలో వేసుకున్నారు. ఇప్పుడు క్రిష్ దర్శకత్వంలో నటిస్తున్న ‘హరి హర వీరమల్లు’ మూవీ షూటింగ్ పూర్తి చేయడంతో పాటు హరీష్ శంకర్ దర్శకత్వంలో తెరకెక్కనున్న ‘భవదీయుడు భగత్ సింగ్’ సినిమాను కూడా పూర్తి చేయాలని పవన్ కళ్యాణ్(Pawan Kalyan) చూస్తున్నాడు. ఇప్పప్పటికే ఈ సినిమా నుంచి విడుదల చేసిన ఫస్ట్ లుక్ పోస్టర్ అభిమానులను ఎంతగానో ఆకట్టుకుంది. అయితే ఈ సినిమా ఎప్పుడు ప్రారంభమవుతుందా అని ఎదురుచూస్తున్న పవన్ కళ్యాణ్ అభిమానులకు చిత్ర యూనిట్ ఇటీవలే అదిరిపోయే గుడ్ న్యూస్ అందించింది. త్వరలోనే ఈ సినిమాకు సంబంధించిన కీలక అప్డేట్స్ ని అందివనున్నట్లు తెలిపింది.
అయితే తాజాగా ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ పై ఆసక్తికర వార్త ఇండస్ట్రీలో హల్చల్ చేస్తోంది. తాజా సమాచారం ప్రకారం ఈ సినిమా చిత్రీకరణ జూన్ నుంచి ప్రారంభమవనున్నట్లు సమాచారం. అలాగే ఈ సినిమాలో తొలుత పవన్ కళ్యాణ్ లేని సీన్స్ పూర్తి చేయాలని హరీష్ శంకర్ భావిస్తున్నాడట. పవన్ కళ్యాణ్ ప్రస్తుతం చేస్తున్న ‘హరిహర వీరమల్లు’ షూటింగ్ పూర్తయిన తరువాత భవదీయుడు భగత్ సింగ్ చిత్రీకరణలో చేరనున్నట్లు తెలుస్తోంది. కాగా, ‘భవదీయుడు భగత్ సింగ్’(Bavadiyudu Bhagatsingh) సినిమాను ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తుండగా.. ఇందులో పవన్ కళ్యాణ్ సరసన బుట్ట బొమ్మబ్ పూజా హెగ్డే హీరోయిన్‌గా నటించనుంది.
Recent Comment