నేచురల్ స్టార్ నాని(Nani) ప్రస్తుతం మంచి జోరు మీదున్నాడు. తన తాజా చిత్రం ‘అంటే.. సుందరానికీ!’ సినిమా చిత్రీకరణని ఇటీవల పూర్తి చేసిన నాని తన తదుపరి చిత్రం ‘దసరా’(Dasara)కు ఇప్పుడు టైమ్ కేటాయించనున్నారు. ఈ చిత్రంతో శ్రీకాంత్ ఓదెల దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. ఈ మూవీలో నాని సరసన కీర్తి సురేష్‌ హీరోయినా గా నటిస్తుంది. గోదావరిఖని ప్రాంతంలోని సింగరేణి బొగ్గు గనుల నేపథ్యంలో ఈ సినిమా రూపొందనుంది. శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర సినిమాస్ (ఎస్ఎల్‌వీసీ) బ్యానర్‌పై సుధాకర్ చెరుకూరి ఈ సినిమాను నిర్మిస్తున్నారు.

ఇక ఈ చిత్రానికి సంబంధించి ఇటీవల ఫస్ట్ లుక్ విడుదలవగా దానికి చక్కటి స్పందన లభించింది. అయితే ఈ సినిమా నాన్-థియేట్రికల్ రైట్స్ రికార్డు ధరకు అమ్ముడుపోయినట్లు తెలుస్తోంది. “దసరా” సినిమా నాన్ థియేట్రికల్ రైట్స్ ద్వారా చిత్రబృందం రూ.45 కోట్లు అందుకున్నట్లు తెలుస్తోంది. నాని చేసిన సినిమాల్లో ఇదే అత్యధికం కావడం విశేషం. అంతకుముందు నాని గ‌త చిత్రం శ్యామ్ సింగ‌రాయ్ నాన్ థియేట్రిక‌ల్ హ‌క్కులు 35కోట్ల‌కు అమ్ముడ‌య్యాయి. కాగా,ఈ చిత్రాన్ని ఈ ఏడాది చివర్లో దసరా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇక ఈ చిత్రంలో సముద్రఖని, సాయి కుమార్, జరినా ముఖ్య పాత్రలు పోషించనున్నారు. అయితే ఈ సినిమాను ప్రకటించినప్పుడే ఇది అవుట్ అండ్ అవుట్ మాస్ మూవీ అని అందరికీ తెలిసిపోయింది.