యంగ్ హీరో వరుణ్ తేజ్(Varun Tej) కథానాయకుడుగా కిరణ్ కొర్రపాటి దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా ‘గని’(Ghani). ఇందులో వరుణ్ తేజ్ కు జోడీగా బాలీవుడ్ నటి సయీ(Sayi Manjrekar) మంజ్రేకర్ నటిస్తోంది. ఈ చిత్రం ఏప్రిల్ 8న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇక విడుదల తేదీ దగ్గరపడుతుండటంతో ప్రమోషన్ కార్యక్రమాలను వేగవంతం చేసింది చిత్రబృందం. తాజాగా సినీ ఇండస్ట్రీ వర్గాల సమాచారం మేరకు, ఫ్యాన్సీ రేటుకు ‘గని’ ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగిందని వార్తలు వినిపిస్తున్నాయి.
భారీ అంచనాల మధ్య విడుదలవుతున్న ఈ చిత్రానికి రెండు తెలుగు రాష్ట్రాల్లో పెద్దఎత్తున ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రెండు తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమాకు రూ.21 కోట్ల బిజినెస్ జరిగింది. అలాగే కర్ణాటక, ఓవర్సీస్, రెస్ట్ ఆఫ్ ఇండియాలో కలిపి రూ.4.30 కోట్ల బిజినెస్ జరిగింది. మొత్తంగా ‘గని’ చిత్రానికి ప్రపంచవ్యాప్తంగా రూ.25.30కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది. ఇక ఈ సినిమా ఎలాంటి నెగిటివ్ టాక్ లేకుండా సువర్ హిట్ గా నిలవాలంటే బాక్సఫీసు వద్ద దాదాపు రూ.26.30 కోట్ల వరకు కలెక్షన్లు రాబట్టాల్సి ఉంది. అలాగే గని సినిమాకు సంబందించిన నాన్-థియేట్రికల్ రైట్స్ ఇప్పటికే 25కోట్లకు అమ్ముడైందని టాక్ వినిపిస్తోంది. మరి ఈ సినిమా థియేటర్స్‌లో కలెక్షన్స్ ఏవిధంగా ఉంటాయనేది తెలియాలంటే ఏప్రిల్ 8 వరకు ఆగాల్సిందే.
Recent Comment