యంగ్ టైగర్ ఎన్టీఆర్(Ntr), దర్శకుడు కొరటాల శివ (Koratala Shiva) కాంబినేషన్‌లో ఓ సినిమా రూపొందనున్న సంగతి తెలిసిందే. చాలా రోజుల కిందటే ఈ సినిమాకి సంబంధించిన అధికారిక ప్ర‌క‌ట‌న సైతం వెలువ‌డింది. జ‌న‌తా గ్యారేజ్ త‌ర్వాత వీరిద్ద‌రి కాంబోలో రానున్న ఈ సినిమాకు కోలీవుడ్ మ్యూజిక్ సెన్సేషన్ అనిరుధ్ సంగీతం అందించనున్నాడు. ఇందులో ఎన్టీఆర్ కు జోడీగా బాలీవుడ్ భామ ఆలియా భట్ ( Alia bhatt ) నటిస్తున్నట్టు వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే.

అయితే అనూహ్యంగా ఆ చిత్రం నుంచి ఆలియా భట్ తప్పుకున్నట్టు తెలుస్తోంది. తన బిజీ షెడ్యూల్ కారణంగా ఈ సినిమా నుంచి వైదొలిగినట్టు తెలుస్తోంది. తాజా సమాచారం ప్రకారం ఈ సినిమాలో మరో బాలీవుడ్ హీరోయిన్ కియారా అద్వానీని( Kiara Advani ) కథానాయికగా కొరటాల శివ ఎంపిక చేయాలని భావిస్తున్నాడట. అలాగే జూన్ తొలి వారం నుంచి ఈ సినిమా రెగ్యులర్‌ షూటింగ్ ను ప్రారంభించాలని కొరటాల శివ ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. కాగా, యువ సుధ ఆర్ట్స్‌, ఎన్టీఆర్ ఆర్ట్స్ ప‌తాకాల‌పై భారీ బడ్జెట్ తో ఈ సినిమా తెరకెక్కనుంది.