యంగ్ హీరో వరుణ్‌ తేజ్‌(Varun Tej) కథానాయకుడుగా కిరణ్‌ కొర్రపాటి దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా ‘గని’(Ghani). ఇందులో వరుణ్‌ తేజ్‌ కు జోడీగా బాలీవుడ్‌ నటి సయీ(Sayi Manjrekar) మంజ్రేక‌ర్ నటించింది. బాక్సింగ్ కథాంశంతో తెరకెక్కిన ఈ సినిమా ఏప్రిల్ 8న ప్రేక్ష‌కుల ముందు వ‌చ్చింది. అయితే విడుదలైన తొలి రోజే ఈ సినిమాకు మిక్స్‌డ్ టాక్‌ రావడంతో దీని ప్ర‌భావం క‌లెక్ష‌న్స్‌పై కూడా తీవ్ర ప్రభావం చూపింది. ట్రేడ్ వ‌ర్గాల్లో వినిపిస్తోన్న స‌మాచారం మేర‌కు గ‌ని సినిమా మొదటి మూడు రోజుల తర్వాత తెలుగు రాష్ట్రాల్లో దాదాపు నాలుగు కోట్ల షేర్ రాబట్టగలిగింది.

భారీ అంచనాల మధ్య విడుదలైన ఈ సినిమా బాక్సఫీసు వద్ద తేలిపోవడంతో డిస్ట్రిబ్యూటర్లు నష్టపోవడం ఖాయమని చెప్పొచ్చు. మరో రెండు రోజుల్లో విజయ్ ‘బీస్ట్’ మూవీ అలాగే కేజీఎఫ్ 2 సినిమాకి ఎక్కువ స్క్రీన్‌లు అవసరం ఉండడంతో ఈ సినిమాను చాలా థియేటర్ల నుండి తొలగించడం ఖాయంగా కనిపిస్తోంది. ఇక అంతకుముందు ‘గని’ సినిమా శాటిలైట్, డిజిటల్, థియేట్రికల్ రైట్స్ అన్ని కలుపుకొని మొత్తంగా రూ. 25 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ చేసింది. ఇదిలా ఉంటే ఇప్పుడు ఈ మూవీ ఓటీటీలో అలరించేందుకు సిద్ధమైన సంగతి తెలిసిందే. ఏప్రిల్ 29వ తేదీ నుంచి ఆహాలో స్ట్రీమింగ్‌ కానుంది.