క్రేజీ కాంబినేషన్ కి తెర తీసింది యు వి క్రియేషన్స్.  అనుష్క శక్తివంతమైన పాత్రలకు పెట్టింది పేరు.  జాతిరత్నాలు తో ఒక్క సారి క్రేజ్ సంపాదించుకున్న హీరో నవీన్ పోలిశెట్టి.

నవీన్ పోలిశెట్టి – అనుష్క కాంబినేషన్ లో ఒక సినిమా ప్లాన్ చేస్తున్నారు యు వి క్రియేషన్స్ వారు. 

ఈ నెల నాలుగు నుండి ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ ప్రారంభిస్తున్నట్టు చిత్ర యూనిట్ ప్రకటించింది.  మహేష్ బాబు ఈ చిత్రానికి దర్శకుడు. 

ఒక సరికొత్త కధ తో, తెలుగు తో పాటు అన్ని భాషల్లోనూ ఒకే సారి చిత్రీకరిస్తున్నారు.  అనుష్కను ఈ సినిమాలో సరికొత గా చూపించబోతున్నారట.