మెగాస్టార్‌ చిరంజీవి కథానాయకుడుగా అగ్ర దర్శకుడు కొరటాల శివ దర్శకత్వంలో రూపొందుతున్న సినిమా ‘ఆచార్య’. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఇందులో ముఖ్య పాత్ర పోషిస్తున్నాడు. ‘సిద్ధ’ అనే కీలక పాత్రలో చరణ్ మెరవనున్నాడు. ఈ సినిమాలో చిరంజీవి సరసన చందమామ కాజల్ కథానాయికగా నటించగా.. రామ్‌ చరణ్‌క జోడీగా బుట్టబొమ్మ పూజా హెగ్డే నటించింది. అలాగే సోనూసూద్‌ కీలక పాత్ర పోషించాడు. శ్రీమతి సురేఖ కొణిదెల సమర్పణలో మ్యాట్నీ ఎంటర్‌టైన్మెంట్స్, కొణిదెల ప్రొడక్షన్ కంపెనీ బ్యానర్లపై నిరంజన్ రెడ్డి, రామ్ చరణ్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. భారీ అంచనాల మధ్య రూపొందుతున్న ఈ చిత్రం ఏప్రిల్‌ 29న విడుదల కానుంది.

ఇదిలాఉంటే, మెగా అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తోన్న సమయం రానే వచ్చేసింది.ఆచార్య సినిమా ట్రైలర్ ఈరోజు సాయంత్రం 5 గంటల 49 నిమిషాలకు థియేటర్స్ లో విడుదల చేయగా.. సోషల్ మీడియాలో ఈ సినిమా ట్రైలర్ ని సాయంత్రం 6 గంటల 12 నిమిషాలకి విడుదల చేశారు. ఈ ట్రైలర్ ఆధ్యంతం అభిమానుల్ని ఆకట్టుకునేలా సాగింది. ‘ఆచార్య’ ట్రైలర్ చూస్తుంటే చిరంజీవి హీరోయిజాన్ని కొరటాల శివ ఏ రేంజ్‌లో ఎలివేట్ చేశారో అర్థమవుతోంది. ఈ ట్రైలర్ లో చిరంజీవి స్టైల్, చూసిన మెగా ఫ్యాన్స్ ఫుల్ ఖుషి అవుతున్నారు.