పాన్ ఇండియా స్టార్ ప్రభాస్(Prabhas) ప్రస్తుతం కెజిఎఫ్ మూవీ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ‘సలార్’ (Salaar) సినిమాలో నటిస్తున్న సినిమా చిత్రీకరణ శరవేగంగా జరుగుతుంది. ఇందులో హీరోయిన్‌గా శ్రుతీ హాసన్ ఆద్య పాత్ర పోషిస్తోంది. పాన్ ఇండియా లెవల్లో రూపొందుతున్న ఈ చిత్రానికి రవి బస్‌రూర్ సంగీతం అందిస్తుండగా… సీనియర్ నటుడు జగపతిబాబు ముఖ్య పాత్రలో కనిపించనున్నాడు. అయితే సలార్ మూవీ ప్రకటించినప్పటి నుంచి ఓ వార్త వైరల్ అవుతున్న సంగతి తెలిసిందే. ప్రశాంత్ నీల్ సలార్ మూవీని కేజీఎఫ్ 2 తరహాలో రెండు భాగాలుగా రూపొందించనున్నాడని కొన్ని రోజులుగా ఓ వార్త వినిపిస్తోంది. అయితే ఈ అంశంపై దర్శకుడుప్రశాంత్ నీల్ తాజాగా స్పష్టతనిచ్చాడు.
నేను తీయబోయే ప్రతీ మూవీలో ఉగ్రమ్ సినిమా ప్రభావం అనేది ఉంటుంది. సలార్ సినిమాను రెండు భాగాలుగా తీయాలని ప్లాన్ అయితే ఏమి లేదు. ఒకవేళ మేము అలా నిర్ణయించుకుంటే మాత్ర ఖచ్చితంగా అధికారికంగా ప్రకటిస్తాం అని ప్రశాంత్ నీల్ తెలిపారు. దింతో గత కొన్ని రోజులుగా హాట్ టాపిక్ గా ఉన్న సలార్ రెండు భాగాలపై అందరికీ ఒక స్పష్టత వచ్చినట్లయింది. ఇదిలాఉంటే, ఇటీవల కాలికి సర్జరీ చేయించుకున్న ప్రభాస్ పూర్తిగా కోలుకోవడానికి ఇంకో నెల సమయంలో పడుతుందట. దీంతో సలార్ షూటింగ్ మరింత ఆలస్యం అయ్యేలా కనిపిస్తుంది.కాబట్టి ఈ సినిమా కోసం యంగ్ రెబల్ స్టార్ అభిపనులు మరిన్ని రోజులు వెయిట్ చేయక తప్పదు.
Recent Comment