చెన్నై సూపర్ కింగ్స్ ఓపెనర్ ఋతురాజ్ గైక్వాడ్ ఒక్క పరుగుకే అవుట్ అయినా తరువాత, మరో ఓపెనర్ రాబిన్ ఉతప్ప చెలరేగి పోయాడు. కేవలం 27 బంతుల్లో 50 పరుగులు చేశాడు.
ఆ తరవాత వచ్చిన మొయిన్ ఆలీ, శివమ్ దూబే కూడా చెలరేగి పోయారు. మొయిన్ ఆలీ 22 బంతుల్లో 35 పరుగులు, శివమ్ దూబే 30 బంతుల్లో 49 పరుగులు.
అంబటి రాయుడు 20 బంతుల్లో 27 పరుగులు, ధోని 6 బంతుల్లో 16 పరుగులు, కెప్టెన్ జడేజా 9 బంతుల్లో 17 పరుగులు చేశారు.
మొత్తం గా చెన్నై సూపర్ కింగ్స్ 20 ఓవర్ల లో ఏడు వికెట్ల నష్ఠానానికి 210 పరుగులు చేసి, లక్నో సూపర్ జెయింట్స్ ముందు భారీ లక్ష్యాన్ని ఉంచింది.
లక్నో సూపర్ జెయింట్స్ బౌలర్ల లో ఆవేశ్ ఖాన్, ఆండ్రూ టై, రవి బిష్ణోయ్ తలా రెండు వికెట్లు తీశారు
Recent Comment