ఉత్తర ప్రదేశ్, వారణాసి కి చెందిన బాబా శివానంద్ జి వయస్సు 100 ఏళ్ళకు పై బడి ఉంది, అయినా సంపూర్ణ ఆరోగ్యం తో ఉన్నారు.
ఒక చిన్న ఫ్లాట్ లో నివసిస్తున్న ఈయనకు యోగా లో ఇటీవల పద్మశ్రీ అవార్డు ప్రకటించింది కేంద్ర ప్రభుత్వం. పద్మశ్రీ అవార్డు తీసుకోవడానికి వచ్చిన బాబా శివానంద్ జి అవార్డు తీసుకునే సమయంలో రాష్ట్రపతి కి మోకరిల్లడం అందరిని ఆకర్షించింది.
పద్మశ్రీ బాబా శివానంద్ జి ఆరోగ్య రహస్యాలు ఇవే.
- సూర్యోదయానికి ముందే నిద్ర లేవడం
- దైవారాధన
- మితాహారం (ఆహారం తక్కువగా తీసుకోవాలి)
- నూనె పదార్ధాలు తక్కువ గా తీసుకోవాలి
- యోగా (ఏకాగ్రత పెరుగుతుంది)
- రోజుకు ఆరు గంటల నిద్ర
- కోరికలను అదుపులో పెట్టుకోవాలి
- ఉదయం గోరు వెచ్చని నీరు త్రాగడం
- ఉడకపెట్టిన పదార్ధాలను సాయంత్రం ఆహారం తీసుకోవాలి
- రాత్రి 8 గంటలకు నిద్ర పోవడం
వీటిలో ఎన్ని మీరు ఎన్ని ఆచరించగలరో చూడండి. వీటిని అమలులో పెట్టడానికి ప్రయత్నించండి.
బాబా శివానంద్ జి కి , కాస్త వినికిడి సమస్య తప్ప మరే ఇతర ఆనారోగ్యం లేదు. అల్పాహారం గా రొట్టెలు, కాయగూరలు తీసుకుంటారు. ఇక సంపూర్ణ ఆరోగ్యం మీ చేతుల్లోనే
100 సంవత్సరాల పై బడిన బాబా శివానంద్ జి, ఒకే ఒక్కసారి 2014 లో ఓటు వే శారట. అంతకు ముందు దేశమంతా సంచరించేవారట. అప్పట్లో ఆయనకు అడ్రస్ ప్రూఫ్ ఉండేది కాదట.
వ్యక్తుల కన్నా హోదాకు ప్రాముఖ్యత ఇస్తారు బాబా శివానంద్ జి. పద్మశ్రీ విజేత అయిన బాబా శివానంద్ జి కు శుభాకాంక్షలు తెలుపుతోంది వార్త వినోదం.
Recent Comment