తమిళ అగ్రకథానాయకుడు హీరో విజయ్(Vijay), బుట్టబొమ్మ పూజా హెగ్డే(Pooja Hegde) జంటగా నటిస్తున్న మూవీ ‘బీస్ట్'(Beast). ఇందులో దర్శకుడు సెల్వరాఘవన్ ఓ కీలక పాత్ర చేస్తున్నారు. దిలీప్ కుమార్ దర్శకత్వం వహించిన ఈ సినిమా ఏప్రిల్ 13న విడుదల కానుంది. ఇందులో విజయ్ వీర రాఘవన్ అనే మాజీ రా ఏజెంట్ పాత్రలో అలరించనున్నారు . కోలీవుడ్ మ్యూజిక్ సెన్సెషన్ అనిరుధ్ రవిచంద్రన్ సంగీతం అందిస్తున్నఈ మూవీపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇక విడుదల తేదీ దగ్గర పడుతుండడంతో ప్రమోషన్స్ వేగవంతం చేశారు మేకర్స్.
ఇందులో భాగంగానే తాజాగా ఈ మూవీ తెలుగు ట్రైలర్‌ను( Vijay’s Beast Telugu Trailer) రిలీజ్ చేశారు. ఇప్పటికే తమిళ్, హిందీ భాషలలో విడుదల అయిన ఈ సినిమా ట్రైలర్ కి భారీ రెస్పాన్స్ వస్తోంది. కాగా, జార్జియా, చెన్నై సహా పలు ప్రాంతాల్లో షూటింగ్ జరుపుకుంది ఈ సినిమా. అయితే ఇటీవలే చిత్రీకరణ ముగించుకున్న ఈ సినిమా ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటోంది. సన్ పిక్చర్స్ నిర్మిస్తున్న ఈ సినిమాలో షైన్ టామ్ చాకో, యోగిబాబు ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు.
Recent Comment