దర్శకధీరుడు ఎస్ ఎస్ రాజమౌళి(Rajamouli), యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్(Ntr), మెగా పవర్ స్టార్ రామ్‌చరణ్(Ram Charan) ల కాంబినేష‌న్లో తెరకెక్కిన చిత్రం “ఆర్ఆర్ఆర్”. ఇందులో కొమురం భీమ్‌గా యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్‌.. అల్లూరి సీతా రామరాజుగా మెగా ప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్ న‌టించారు. డీవీవీ ఎంటర్‏టైన్మెంట్స్, పెన్ స్టూడియోస్, లైకా సంయుక్తంగా నిర్మించిన ఈ సినిమా మార్చి 25న ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకువచ్చింది. విడుదలైన తొలి రోజు నుంచే హిట్ టాక్ సంపాదించుకున్న ఈ చిత్రం బాక్సఫీసు వద్ద కలెక్షన్ల ప్రభంజనం సృష్టించింది.

ప్రపంచ వ్యాప్తంగా ఈ సినిమా ఎనిమిది రోజుల్లోనే 800 వందల కోట్ల వసూళ్ళు సాధించింది. ఓవర్సీస్‌లో కూడా పది మిలియన్ల డాలర్లను సునాయాసంగా క్రాస్ చేసింది. అలాగే తాజాగా ఈ చిత్రం నైజాంలో ఆల్ టైమ్ రికార్డును క్రియేట్ చేసింది. ఆర్ఆర్ఆర్ మూవీ ఇప్పటివరకూ నైజాంలో 90 కోట్లకి పైగా షేర్ ను వసూలు చేసి అగ్రస్థానంలో నిలిచింది. ఇప్పటి వరకూ నైజాంలో ఏ సినిమా కూడా 90 కోట్ షేర్ రాబట్టలేదు. తాజాగా ఆ ఘనతను ఆర్ఆర్ఆర్ మూవీ సాధించింది.