అక్కినేని నాగార్జున, ఆయన తనయుడు నాగచైతన్య, సీనియర్ హీరోయిన్ రమ్యకృష్ణ, యువ కథానాయిక కృతి శెట్టి ప్రధాన పాత్రల్లో నటించిన సినిమా బంగార్రాజు. ఇటీవల సంక్రాంతి కానుకగా జనవరి 14న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా మంచి విజయం సాధించింది. కల్యాణ్ కృష్ణ దర్శకత్వం వహించిన ఈ సినిమాకు అనూప్ రూబెన్స్ సంగీతం అందించారు. అన్నపూర్ణ స్టూడియోస్, జీ స్టూడియోస్ సంయుక్తంగా నిర్మించిన ఈ చిత్రానికి నాగార్జున నిర్మాతగా వ్యవహరించాడు.

సంక్రాంతికి థియేటర్లలో విడుదలై సూపర్‌ హిట్టయిన ఈ మూవీ ఫిబ్రవరి 18 నుంచి ”జీ 5′ లో స్ట్రీమింగ్‌ అవుతున్న విషయం అందరికీ తెలిసిందే. అయితే తాజాగా బంగార్రాజు చిత్రం ఇప్పుడు వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్ గా బుల్లితెర ప్రేక్షకులను అలరించడానికి రెడీ అవుతోంది. ఈ మూవీ వచ్చే ఆదివారం జీ టీవీ లో ప్రసారం కానుంది. కాగా, గ్రామీణ నేపథ్యంలో సాగే ఈ సినిమా భావోద్వేగాలతో కూడిన కథ కావడం.. వినోదానికి సంబందించిన అంశాలు కలిగి ఉండటం ఈ సినిమా విజయానికి కలిసొచ్చాయని చెప్పొచ్చు.