సినీ ప్రియులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న భారీ మల్టీ స్టారర్‌ చిత్రం “రౌద్రం.. రణం.. రుధిరం” (ఆర్‌ఆర్‌ఆర్‌) దర్శకదీరుడు ఎస్‌ఎస్‌ రాజమౌళి (Rajmouli)దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో కొమురం భీమ్‌గా యంగ్ టైగర్ ఎన్టీఆర్‌(Ntr), అల్లూరి సీతారామరాజుగా మెగా పవర్ స్టార్ రామ్‌చరణ్‌(Ramcharan) ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. దాదాపు రూ. 400 కోట్లు భారీ బడ్జెట్‌తో ఈ పాన్‌ ఇండియా సినిమాను డీవీవీ దానయ్య నిర్మించారు. ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా మార్చి 25న విడుదల కానుంది.

అయితే ఆర్ఆర్ఆర్ మూవీ రిలీజ్ కు మరికొన్ని గంటలే సమయం ఉండడంతో ప్రస్తుతం ప్రీ రిలీజ్ బిజినెస్ లెక్కలు హాట్ టాపిక్ గా మారాయి. ఆర్ఆర్ఆర్ సినిమా ఒక్కో ప్రాంతంలో ఇంతకు అమ్ముడుపోయిందనే విషయనించుస్తే… నైజాంలో 70 కోట్లు, సీడెడ్ లో 45 కోట్లు, ఉత్తరాంద్రలో 26 కోట్లు, గుంటూరులో 18 కోట్లు, తూర్పుగోదావరిలో 17కోట్లు, పశ్చిమ గోదావరిలో 14 కోట్లు, కృష్ణా 14 కోట్లు, నెల్లూరు 9 కోట్లు ఇలా మొత్తంగా రెండు రెండు రాష్ట్రాల్లో కలిపి 213 కోట్ల వరకు అమ్ముడుపోయినట్టు సమాచారం.

అలాగే తమిళనాడులో 45 కోట్లు, కర్ణాటకలో 50 కోట్లు, కేరళలో 10 కోట్లు, ఉత్తరాదిలో మొత్తంగా 100 కోట్లు, ఓవర్సీస్‌లో 70 కోట్లు ఇలా వరల్డ్ వైడ్ గా దాదాపు 490 కోట్ల వరకు అమ్ముడిపోయిందని తెలుస్తోంది.