నాచురల్ స్టార్ నాని(Nani) కథానాయకుడిగా యంగ్ డైరెక్టర్ వివేక్ ఆత్రేయ దర్శకత్వంలో రూపొందుతున్న సినిమా ‘అంటే సుందరానికి’.(Ante Sundaraniki ) ఇందులో నాని పాత్ర పేరు ‘కస్తూరి పూర్ణ వెంకట శేషసాయి పవన రామసుందర ప్రసాద్’. మైత్రీ మూవీ మేకర్స్ పతాకంపై తెరకెక్కిస్తున్న ఈ చిత్రానికి నవీన్ ఎర్నేని, రవిశంకర్ .వై నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. అలాగే చిత్రానికి వివేక్ సాగర్ సంగీతం అందిస్తున్నారు.
ఫుల్ ఫ్యామిలీ అండ్ కామెడీ ఎంటర్టైనర్‌గా తెరకెక్కుతున్న ఈ సినిమాలో నానికి జోడిగా మలయాళ బ్యూటీ నజ్రియా నజీమ్ నటిస్తోంది. ఈ మూవీలో నజ్రియా లీలా థామస్‌గా నటించనుంది. ఈ సినిమాను జూన్ 10వ తేదీన విడుదల చేసేందుకు చిత్రయూనిట్ సన్నాహాలు చేస్తున్నారు. అయితే వివేక్ సాగర్ సంగీతాన్ని సమకూర్చిన ఈ మూవీ నుంచి ఫస్ట్ సింగిల్ రిలీక్ కు తాజాగా ముహూర్తాన్ని ఫిక్స్ చేశారు మేకర్స్. ఏప్రిల్ 6 న సాయంత్రం 6 గంటల 3 నిమిషాలకి ‘పంచె కట్టు’ అంటూ సాగే ఫస్టు సింగిల్‌ను విడుదల చేయనున్నట్లు ట్విట్టర్ వేదికగా పేర్కొన్నారు.
Recent Comment