యంగ్ టైగర్ ఎన్టీఆర్(Ntr), మెగా పవర్ స్టార్ రామ్ చరణ్(Ram Charan) హీరోలుగా దర్శకుడు రాజమౌళి తెరకెక్కించిన భారీ మల్టీస్టారర్ చిత్రం ‘ఆర్‌ఆర్‌ఆర్’ (RRR) మార్చి 25న విడుదలైన కలెక్షన్ల వర్షం కురిపిస్తోంది. అయితే ఈ మల్టీస్టారర్ మూవీ ఘన విజయం సాధించడంతో ఇప్పుడు మరో క్రేజీ కాంబోకు రంగం సిద్ధమైనట్టు ఇండస్ట్రీలో వార్తలు వినిపిస్తున్నాయి. టాలెంటెడ్ డైరెక్టర్ కొరటాల శివ దర్శకత్వంలో అల్లు అర్జున్(Allu Arjun), ధనుష్(Danush) హీరోలుగా ఓ పాన్ ఇండియా చిత్రం తెరకెక్కనున్నట్టు సమాచారం.
ప్రస్తుతం కొరటాల శివ(Koratala Shiva) దర్శకత్వంలో చిరంజీవి, రామ్ చరణ్ హీరోలుగా రూపొందుతున్న ఆచార్య(Acharya) సినిమాను రూపొందిస్తున్నారు. ఇది ఏప్రిల్ 29న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఆ తరువాత కొరటాల శివ తన నెక్స్ట్ మూవీని ఎన్టీఆర్‌తో చేయబోతున్న విషయం తెలిసిందే. యువ సుధా ఆర్ట్స్, ఎన్టీఆర్ ఆర్ట్స్ పతాకాలపై ఈ సినిమా తెరకెక్కనుంది. ఇక ఆ సినిమా ముగిసిన వెంటనే అల్లు అర్జున్, ధనుష్ హీరోలుగా ఓ సినిమాని కొరటాల శివ రూపొందించనున్నారని తెలుస్తోంది. అయితే దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.
Recent Comment