నరేంద్ర మోడి (Narendra Modi ) గారు భారతదేశ రాజకీయాల్లో సంచలనం సృష్టించిన నాయకుడు. ఇక భారత ప్రగతికి మోడీ అనేక ప్రయోగాలు చేస్తూ పథకాలను ప్రవేశ పెడుతున్నారు.ఇండియాలో ఎప్పటి నుంచో తీరని సమస్య నిరుద్యోగం. దీనిపై అధికారంలోకి వస్తే నిరుద్యోగ సమస్య లేకుండా చేస్తా అని మోడీ(Modi ) మాట ఇచ్చారు.దీనిపై ఇన్ని రోజులు సైలెంట్ గా ఉన్న మోడీ ఎనిమిదేళ్ల తర్వాత ఇప్పుడు దీనిపై సంచలన వ్యాఖ్యలు చేశారు. భారత్ లో ఈ సమస్య పోవాలంటే ప్రజలు ఏం చెయ్యాలో తెలిపారు.

భారతీయులు(Indians ) అందరూ స్వయం సమృద్ధిగా మారాలని తెలిపారు. ఇండియాలో తయారు చేసిన వస్తువులను మాత్రమే కొనుగోలు చేయాలని ప్రజలకు తెలిపారు. వచ్చే 25 సంవత్సరాల పాటు భారతీయులు దేసి వస్తువులను ఉపయోగిస్తే భారత్ లో నిరుద్యోగ సమస్య ఉండదని తెలిపారు. గుజరాత్‌లోని మోర్బీలో 108 అడుగుల ఎత్తైన హనుమంతుడి విగ్రహాన్ని వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రారంభించిన ప్రధాని తరువాత మాట్లాడారు.భారతదేశానికి చెందిన సాధువులను,గురువులను ప్రజలకు స్థానిక వస్తువులు మాత్రమే కొనుగోలు చేయాలని బోధించాలని కోరుతున్నట్లు తెలిపారు. దేశంలో నిరుద్యోగ సమస్యకు స్థానిక వస్తువులు మాత్రమే కొనాలని ప్రజలకు పిలుపునిచ్చారు