మోహన్‌రాజా(Mohan Raja) దర్శకత్వంలో చిరంజీవి(Chiranjeevi) గాడ్‌ఫాదర్(God Father) అనే సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. మలయాళ సూపర్ హిట్ చిత్రం లూసిఫర్‌కి రీమేక్‌గా ఈ సినిమా తెరకెక్కుతోంది. ఇందులో నయనతార హీరోయిన్ గా నటిస్తుండగా.. బాలీవుడ్ సూపర్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్(Salman Khan) కీలక పాత్రలో నటించనున్నాడు. ప్రస్తుతం ‘గాడ్ ఫాదర్’ సినిమా రెగ్యులర్ షూటింగ్ ముంబైలో జరుగుతోంది. అయితే తాజా సమాచారం ప్రకారం ఈ సినిమాలో టాలీవుడ్ అగ్ర దర్శకుడు పూరీ జగన్నాధ్ (Puri Jagannath) అతిథి పాత్రలో కనిపించబోతున్న సంగతి తెలిసిందే.
ఇటీవలె పూరీ జగన్నాథ్ చిరంజీవితో కలిసి ఈ సినిమా షూటింగ్ లో పాల్గొనగా.. ఇందుకు సంబంధించిన ఫొటోలు సైతం సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. అయితే తాజా సమాచారం ప్రకారం ఈ సినిమాలో పూరీ జగన్నాథ్ ఓ పవర్ ఫుల్ జర్నలిస్ట్ పాత్రలో కనిపించనున్నాడని సమాచారం. ఒక విధంగా సినిమాను ముందుకు నడిపే పాత్రగా ఇది ఉండనున్నట్లు తెలుస్తోంది. లూసిఫర్ ఈ పాత్రను పృధ్విరాజ్ అన్న ఇంద్రజిత్ పోషించాడు. ఇప్పుడు ‘గాడ్ ఫాదర్’లో ఈ పాత్రను పూరీ జగన్నాథ్ చేయబోతున్నాడని టాక్ వినిపిస్తోంది. మరి ఇందులో నిజమెంతుందో తెలియాలంటే అధికారిక ప్రకటన వచ్చేవరకు ఆగాల్సిందే.
Recent Comment