దర్శకధీరుడు రాజమౌళి(Rajamouli), యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్(Ntr), మెగా పవర్ స్టార్ రామ్‌చరణ్(Ram Charan) ల కాంబినేష‌న్లో తెరకెక్కిన చిత్రం “ఆర్ఆర్ఆర్”.ఇందులో కొమురం భీమ్‌గా యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్‌.. అల్లూరి సీతా రామరాజుగా మెగా ప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్ న‌టించారు. డీవీవీ ఎంటర్‏టైన్మెంట్స్, పెన్ స్టూడియోస్, లైకా సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమా మార్చి 25న విడుదల కానుంది.

అయితే తాజా స‌మాచారం ప్రకారం.. ఆర్ఆర్ఆర్ సినిమా విడుదలకు ముందే ఓ అరుదైన రికార్డు సాధించింది. ఈ సినిమా ఓవ‌ర్ సీస్ ప్రీమియ‌ర్స్ క‌లెక్ష‌న్స్ ఇప్ప‌టికే రెండు మిలియ‌న్స్‌ను దాటేసి.. మూడు మిలియ‌న్ డాల‌ర్స్ వైపు పరుగులు తీస్తోంది. ఈ లెక్కన ఓవ‌ర్ సీస్‌లో ఆర్ఆర్ఆర్ సినిమా ప్రీమియ‌ర్స్‌కే రూ.20 కోట్ల కలెక్షన్లను వసూలు చేస్తుందని ట్రేడ్ విశ్లేషకులు పేర్కొంటున్నారు. అయితే ఓవర్ సీస్ ప్రీమియ‌ర్స్ విషయంలో రెండు మిలియ‌న్ డాల‌ర్స్ మార్కును చేరిన తొలి భారత సినిమా కూడా ఆర్ఆర్ఆర్ కావడం విశేషం.