ఇండియన్ ప్రీమియర్ లీగ్ లో భాగం గా చెన్నై సూపర్ కింగ్స్, లక్నో సూపర్ జెయింట్స్ మధ్య జరిగిన మ్యాచ్ లో లక్నో, చెన్నై పై 6 వికెట్ల తేడాతో విజయం సాధించింది.

మొదట బాటింగ్ చేసిన చెన్నై 4 వికెట్ల నష్టానికి 210 పరుగుల భారీ స్కోర్ చేసింది.  కెప్టెన్, ఓపెనర్ అయిన ఋతురాజ్ 108 పరుగుల తో అజేయంగా నిలవగా, శివమ్ దూబే శివాలెత్తిపోయాడు. కేవలం 27 బంతుల్లో 66 పరుగులు చేశాడు  (3×4 and 7×6).  ఇన్నింగ్స్ చివరి బాల్ ఆడిన ధోని ఫోర్ కొట్టడం విశేషం.

తరవాత 211 పరుగుల విజయ లక్ష్యం తో బాటింగ్ ప్రారంభించిన లక్నో సూపర్ జెయింట్స్ కు ఆదిలోనే ఎదురు దెబ్బ తగిలింది. ఓపెనర్ క్విన్టన్ డి కాక్ డక్ అవుట్ అయ్యి వేణు తిరిగాడు.  అయితే స్టయినిస్ అసాధారణ బాటింగ్ తో లక్నో 6 వికెట్ల తేడాతో విజయం సాధించింది.  స్టయినిస్ కేవలం 63 బంతుల్లో 124 పరుగులు చేశాడు  (13×4 and 6×6). 

ఇండియన్ ప్రీమియర్ లీగ్ లో, స్టయినిస్, తన మొదటి సెంచరీ ని నమోదు చేసుకున్నాడు

మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ : స్టయినిస్