జీ ఎంటర్టైన్మెంట్ కంపెనీ, స్వదేశీ సంస్థ.  పరిచయం అవసరం లేని కంపెనీ. అన్ని భాషల్లో కలిపి సుమారు ౪౦ టెలివిజన్ చానెల్స్ ఈ జీ సంస్థ ఆధ్వర్యం లో నడుస్తున్నారు.  అయితే జీ గ్రూప్  వారు సినిమా నిర్మాణ రంగంలో కి అడుగు పెడుతున్నారు.

టైమ్స్ గ్రూప్, ఎకనామిక్ టైమ్స్ కథనం ప్రకారం, వచ్చే ఆర్థిక సంవత్సరానికి అంటే FY23 లో 2000-2500 కోట్ల ఆదాయాన్ని మూవీ బిజినెస్ ద్వారా ఆర్జించాలని యోచిస్తున్నారు.  ఈ సంవత్సరం, అనగా FY22 లో జీ గ్రూప్ వారు 23  సినిమాలను విడుదల చేశారు. ఈ మధ్యనే జీ గ్రూప్ వారి “ది కాశ్మీర్ ఫైల్” లో బడ్జెట్ తో నిర్మించబడ్డ ఈ చిత్రం అతి పెద్ద విజయాన్ని నమోదు చేసుకుంది. ది కాశ్మీర్ ఫైల్ ఇచ్చిన స్ఫూర్తి తో వచ్చే ఆర్థిక సంవత్సరం లో దూకుడు పెంచి, వచ్చే ఆర్థిక సంవత్సరం లో 48 సినిమాలు విడుదల చేయాలనీ లక్ష్యం గా పెట్టుకుంది

మూవీ శాటిలైట్, డిజిటల్, మ్యూజిక్ హక్కుల ధర లు ఆకాశాన్ని అంటుతున్నాయి. జీ గ్రూప్ వారి OTT platform జీ5 కు మూవీస్ కావాలి. అలాగే టెలివిజన్ చానెల్స్ కు కూడా సినిమాల అవసరం ఎంతో ఉంది.  వీటన్నింటిని దృష్టిలో ఉంచుకుని సినిమా నిర్మాణ రంగం లో మరింత దూకుడుగా ఉండాలని జీ గ్రూప్ వారు యోచిస్తున్నారు.  సినిమా నిర్మాణం లో భాగస్వామిగా, ఇప్పటికే సల్మాన్ ఖాన్ రాధే సోలో బ్రతుకే సో బెటర్, రిపబ్లిక్, బంగార్రాజు, వలిమై ది కాశ్మీర్ ఫైల్స్ చిత్రాలను విడుదల చేశారు.

ఇప్పుడు రామ్ చరణ్, శంకర్ కాంబినేషన్ లో వస్తున్న పాన్ ఇండియా చిత్రం లో కూడా, జీ గ్రూప్ వారు భాగస్వాములే.  అంతే కాకుండా, పవన్ కళ్యాణ్ తో కూడ సినిమాలను నిర్మిస్తున్నారు.

మరో వైపు, మై హోమ్ గ్రూప్ (TV9) వారు, పూరి జగన్నాధ్, విజయ దేవరకొండ JGM చిత్రం లో భాగస్వామ్యులు అయ్యారు