రాయల్ చాలెంజర్స్, బెంగుళూరు మరియు ఢిల్లీ క్యాపిటల్స్ మధ్య జరిగిన మ్యాచ్ లో మొదట బ్యాటింగ్ చేసిన రాయల్ చాలెంజర్స్, బెంగుళూరు 5 వికెట్ల నష్టానికి 189 పరుగులు చేసింది. 

ఓపెనర్ లు అనూజ్ రావత్ డక్ అవుట్ కాగా, మరో ఓపెనర్ డుప్లెసిస్ 8 పరుగులు చేసి ఔట్ అయ్యాడు. విరాట్ కోహ్లీ 12 పరుగులు చేసి ఔట్ అయ్యాడు. మాక్స్ వెల్ 34 బంతుల్లో 55 పరుగులు చేశాడు.  షాబజ్ 21 బంతుల్లో 32 పరుగులు చేయగా,  ఆఖర్లో దినేష్ కార్తీక్ రెచ్చిపోయాడు.  కేవలం 34 బంతుల్లో 66 పరుగులు ( 5 ఫోర్లు, 5 సిక్సర్లు) చేసి అజేయం గా నిలిచాడు.

ఢిల్లీ క్యాపిటల్స్ బౌలర్ల లో కుల్దీప్ యాదవ్, అక్షర్ పటేల్, శార్దూల ఠాకూర్, ఖలీల్ అహ్మద్ తలా ఒక వికెట్ తీశారు. 

అనంతరం 190 పరుగుల లక్ష్యం తో బ్యాటింగ్ ప్రారంభించిన ఢిల్లీ క్యాపిటల్స్ కు ఓపెనర్ లు డేవిడ్ వార్నర్, ప్రిథ్వి షా తొలి వికెట్ కు 50 పరుగులు జోడించారు.  డేవిడ్ వార్నర్ 38 బంతుల్లో 66 పరుగులు చేసి ఔట్ అయ్యాడు.  కెప్టెన్ రిషబ్ పంత్ 17 బంతుల్లో 34 పరుగులు చేసి సిరాజ్ బౌలింగ్ లో ఔట్ అయ్యాడు. పంత్ తరవాత బాట్స్మన్ ఎవరు నిలబడక పోవడంతో, ఢిల్లీ క్యాపిటల్స్ 20 ఓవర్లలో, ఏడు వికెట్ల నష్టానికి 173 పరుగులు చేసింది

రాయల్ చాలెంజర్స్, బెంగుళూరు బౌలర్ల లో హాజిల్ వుడ్ మూడు వికెట్లు తీయగా, సిరాజ్ రెండు వికెట్లు, హాసరంగా ఒక వికెట్ తీశారు.