సూపర్ స్టార్ మహేష్ బాబు నటిస్తున్న తాజా చిత్రం ‘సర్కారు వారి పాట’. మైత్రీ మూవీ మేకర్స్, జీఎమ్‌బీ ఎంటర్‌టైన్‌మైంట్, 14 రీల్స్ ప్లస్ సంస్థల నిర్మాణంలో టాలెంటెడ్ డైరెక్టర్ పరశురామ్ దర్శకత్వంలో ప్రతిష్టాత్మకంగా రూపొందుతోంది. కీర్తీ సురేశ్ హీరోయిన్‌గా నటిస్తున్న ఈ సినిమా ప్రస్తుతం హైదరాబాద్‌లో షూటింగ్ జరుపుకుంటోంది. మ్యూజిక్ సెన్సెషన్ తమన్ స్వరాలు అందిస్తున్న ఈ సినిమా బ్యాంక్ మోసాల నేపథ్యంలో తెరకెక్కుతోంది.
అయితే మేలో విడుదలకి సిద్దమవుతున్న ఈ సినిమా షూటింగ్ ని చిత్రయూనిట్ శరవేగంగా పూర్తి చేసే పనిలో పడ్డారు. ఇప్పుడు ఈ సినిమా షూటింగ్ దాదాపుగా పూర్తయినట్లు తెలుస్తోంది. చిన్న ప్యాచ్ వర్క్స్ మినహా మొత్తంచిత్రీకరణ పూర్తయినట్లు సమాచారం. అలాగే ప్రస్తుతం మూడో పాటను విడుదల చేసేందుకు మేకర్స్ ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ చిత్రాన్ని మే 27న ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని చిత్రబృందం సన్నాహాలు చేస్తున్నారు. కాగా, మ్యూజిక్ సెన్సెషన్ తమన్ స్వరాలు అందిస్తున్న ఈ సినిమా బ్యాంక్ మోసాల నేపథ్యంలో తెరకెక్కుతోంది.
Recent Comment