సీనియర్ దర్శకుడు మోహన్‌రాజా దర్శకత్వంలో మెగాస్టార్ చిరంజీవి(Chiranjeevi) గాడ్‌ఫాదర్(God Father) అనే సినిమాలో నటిస్తున్న విషయం తెలిసిందే. మలయాళ సూపర్ హిట్ చిత్రం లూసిఫర్‌కి రీమేక్‌గా ఈ సినిమా రూపొందుతోంది. ఇందులో నయనతార కథానాయికగా నటిస్తుండగా.. బాలీవుడ్ సూపర్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్(Salman Khan) ముఖ్య పాత్రలో నటించనున్నాడు. ప్రస్తుతం ‘గాడ్ ఫాదర్’ సినిమా రెగ్యులర్ షూటింగ్ ముంబైలో జరుగుతోంది. ఈ షెడ్యూల్ లో చిరంజీవి, సల్మాన్ ఖాన్‌లపై కీలక సన్నివేశాలు తెరకెక్కిస్తున్నారు.
ఈ సందర్భంగా కొత్త స్టిల్ ఒకటి రి
విడుదల చేశారు మేకర్స్. చిరంజీవి గాడ్ ఫాదర్ గెటప్‌లో నలుపు రంగు డ్రెస్‌లో కనిపిస్తుండగా.. ఆయన పక్కనే సల్మాన్ ఖాన్ నలుపు రంగు ప్యాంట్, నీలం రంగు టీ షర్ట్‌లో స్టైలిష్ లుక్ లో కనిపిస్తున్నారు. ప్రస్తుతం వీరిద్దరికి సంబంధించిన ఫోటో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. కాగా, ఈ సినిమాలో సల్మాన్ ఖాన్ సరికొత్త గెటప్‌లో కనిపించనున్నట్లు సమాచారం. కాగా, తమన్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రానికి సూపర్ గుడ్ ఫిల్మ్స్, కొణిదెల ప్రొడక్షన్ కంపెనీ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి.
Recent Comment